చార్‌ధామ్ యాత్రకు బ్రేకులు, పరిమిత రూట్లలోనే అనుమతి
హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ముఖ్యంగా పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి. ఇళ్లుకూలాయి. నదుల్లో ప్రవాహ ఉదృతి పెరగడంతో అధికారులు ఆప్రమత్తమయ్యారు. రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్ను (Himachal Pradesh) వణికిస్తున్నాయి. జోరువానలకు అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి పలుచోట్ల రహదారులను మూసివేశారు. శిమ్లాలోని భట్టాకువర్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.
ఇప్పటివరకూ వరదల్లో
కాలనీలో ఒక భవనం కింద ఏర్పడిన గుంతలోకి కూరుకుపోయింది. అందులో ఉంటున్నవారిని ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న మరో రెండు భవనాల కూడా ప్రమాదం అంచున ఉన్నాయి. ఇప్పటివరకూ వరదల్లో 19 మంది గల్లంతయ్యారు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మొత్తంగా ఈ సీజన్లో (Season) ఇప్పటివరకూ 23 మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కరోజులోనే నలుగురు మరణించగా తొమ్మిదిమంది వరదల్లో కొట్టుకునిపోయారని చెప్పుతున్నారు. 99 మందిని ఇప్పటివరకూ రక్షించామని అధికారులు వెల్లడించారు.
అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి
హిమాచలప్రదేశ్లో నాలుగు జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో ఆయా జిల్లాల అధికారులు ఆప్రమత్తమయ్యారు, కంగ్రా, మండి, సిర్ మోర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సోలన్ జిల్లాలో చండీగఢ్, శిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. వాక్నాఘాట్ (Waknaghat) నుంచి సుజా తు వెళ్లే మార్గాన్ని కూడా కొండచరియల కారణంగా మూసివేశారు, జేసీబీల సాయంతో రహదారులను పునరు ద్దరించడానికి యత్నిస్తున్నారు. బిలాస్పుర జిల్లాలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి పడడంతో చాలా రోడ్లు మూసివేశారు. చందా, కంగ్రా, కుల్లు, మండి, శిమ్లా, సోలన్, సిర్మోర్ జిల్లాల్లో కొన్ని చోట్ల రాబోవు 24 గంటల్లో ఆకస్మిక వరదలు తలెత్తే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.
డెవలప్ మెంట్ బ్లాక్ పర్వతాలపై
ఈనెల ఆరోతేదీ వరకూ హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలకానంద నదిలో ప్రవాహం పెరుగుతోంది. పౌడీ గద్వాల్ (Paudi Gadwal) జిల్లాలో అలకానంద నదిలో నీట మట్టం పెరిగి ప్రఖ్యాత దరీ దేవి ఆలయం పాక్షికంగా నీట మునిగింది. అలకానంద నదిలో నీటమట్టం ఒక్కసారిగా పెరగడంతో రుద్రప్రయాగ్లో నదిలో ఉన్న మహాశివుని విగ్రహం నీట మునిగింది. చమోలి జిల్లా దషోలి డెవలప్ మెంట్ బ్లాక్ పర్వతాలపై నుంచి కిందకు జారుతున్న మట్టి, బురద, రాళ్లు కారణంగా వికీ మోటార్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో చార్జ్ థామ్ యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎత్తివేసింది.
అనేక ప్రాంతాల్లో
వాతావరణ పరిస్థితులను బట్టి చార్‌ధామ్ యాత్రీకుల వాహనాలకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. అయినా కేదార్నాథ్ భక్తుల సంఖ్య తగ్గింది. కొండచరియలు విరిగిపడిన వార్కోట్ యమునోత్రి మార్గాన్ని అధికారులు పునరుద్ధరించారు. సోమవారం చంబ పట్టణంలో జోరు వర్షం కురిసింది. ఉత్తరప్రదేశ్లో కూడా రుతుపవనాల ప్రమాధంతో అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. హాపూర్, ఆలీగడ్, మొరాదాబాద్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేదింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముజఫర్ నగర్ (Muzaffarnagar) జిల్లాలో కురిసిన వానలకు అనేక చోట్ల, పాత ఇళ్లు కూలాయి. సదర్ తహశీల్ రాప్రా గ్రామంలో ఇల్లుకూలి 80 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది.
ఎడతెరిపిలేని వర్షాలతో గంగా, సోలని
బిజోనోర్ బ్యారేజీ వద్ద గంగా నదిలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరిందని అధికారులు హెచ్చరించారు. ఎడతెరిపిలేని వర్షాలతో గంగా, సోలని నదిలో నీటిమట్టం పెరిగింది. ప్రయాగ్ర్బాజ్లో కూడా గంగా నదిలో నీటిమట్టం పెరిగినట్లు స్థానికులు తెలిపారు. పంజాబ్, హరియాణా, చండీగర్లోనూ వర్షాలు కురిశాయి. హరియాణాలోని యమున నగర్, హిసార్, అంబాలా, రోహ్ తక్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాబ్లోని లూధి యానా, పాటియాలా, మొహలీ, పరాన్కోట్, గురుదాస్ పుర్లోనూ వర్షం పడింది. ఇక దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, లక్షద్వీప్లతోపాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాలకు కూడా కోస్తాతీరంలోని జిల్లాలకు భారీ వర్షాల ముప్పు ఉందని వెల్లడి అయింది. జులై 7వ తేదీవరకూ వర్షాల ప్రభావం ఎక్కువ ఉంటుందని, ప్రజలు ఆప్ర మత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు చేసింది.
Read Also: Terrorist Arrest : రాయచోటి పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు