📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Himachal Pradesh: తొలి సారిగా ఫేస్ రికగ్నిషన్ పద్ధతిలో రేషన్ పంపిణీ

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సౌకర్యంగా రేషన్ అందించడానికి వినూత్నమైన అడుగు వేసింది. ఇప్పటివరకు రేషన్ పంపిణీ వ్యవస్థలో వేలి ముద్రలు (బయోమెట్రిక్), ఓటీపీ (OTP) ఆలస్యం వంటి సమస్యలు పలు రాష్ట్రాల్లో ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, శారీరకంగా అశక్తులైన వారు, పని మీద బయటి ప్రాంతాల్లో ఉన్నవారు రేషన్ పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ ఆధారిత ముఖ ప్రామాణీకరణ విధానాన్ని (Face Recognition Based Aadhaar Authentication) ప్రవేశపెట్టింది.ఇది దేశంలోనే మొట్టమొదటి సారి ఒక రాష్ట్రం రేషన్ పంపిణీలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అధికారికంగా వినియోగిస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల లబ్ధిదారులు ఇకపై తమ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రేషన్ తీసుకోవచ్చు. ప్రత్యేకంగా వేలిముద్ర అవసరం లేదు, ఓటీపీ ఆలస్యం కూడా ఉండదు.

అనేక సవాళ్లను

ఒక వ్యక్తి ముఖం స్కాన్ చేయగానే ఆ కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు వివరాలు, సభ్యుల సంఖ్య, వారికి లభించాల్సిన వస్తువుల వివరాలన్నీ ఆటోమేటిక్‌గా గుర్తించబడతాయి.రేషన్ పంపిణీలో గతంలో అమలులో ఉన్న ఓటీపీ ఆధారిత (OTP based), బయోమెట్రిక్ ప్రామాణీకరణ పద్ధతులు తరచుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయి. లబ్ధిదారులకు ఎస్ఎంఎస్‌లు సకాలంలో చేరకపోవడం, వేలిముద్రలు సరిపోలకపోవడం (బయోమెట్రిక్ మిస్‌మ్యాచ్‌లు) వంటి సమస్యలు రేషన్ పొందేవారికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించేవి. ఈ లోపాలను సరిదిద్ది, ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను ప్రవేశ పెట్టింది.

Himachal Pradesh: తొలి సారిగా ఫేస్ రికగ్నిషన్ పద్ధతిలో రేషన్ పంపిణీ

గత పద్ధతుల్లో

ముఖ్యంగా దీనిపై ప్రిన్సిపల్ అడ్వైజర్ గోకుల్ బుటెల్ మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యవస్థలో డీలర్ స్మార్ట్ ఫోనులో మొబైల్ అప్షికేషన్ వేసి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మొత్తంగా 19 లక్షల 40 వేల 968 రేషన్ కార్డులు ఉన్నట్లు వివరించారు. ఇంత పెద్ద మొత్తంలో రేషన్ కార్డులు ఉండడంతో గత పద్ధతుల్లో రేషన్ పంచడం చాలా కష్టతరంగా ఉండేదని, కానీ ఈ స్కానింగ్ ప్రక్రియ (Scanning process) వల్ల చాలా సులభంగానే రేషన్ పంచగల్గుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ధృవీకరణకు పట్టే సమయాన్ని ఇది తగ్గిస్తుండగా, దీనివల్ల రేషన్ పంపిణీ ప్రక్రియ మొత్తం వేగవంతంగా, మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొంటున్నారు.

Read hindi: hindi.vaartha.com

Read Also: Gold Rates Today: భారీగా తగ్గిన పసిడి ధరలు

#AadharBasedSystem #AadharVerification #DigitalIndia #DigitalWelfare #eGovernance #FaceRecognition #FacialAuthentication #FirstInIndia #GovernmentInitiative #HimachalPradesh #IndiaInnovation #InnovationInGovernance #PublicDistributionSystem #RationCardUpdate #RationDistribution #RationTechUpdate #SmartGovernance #TechForGood #TechnologyForWelfare #WelfareSchemes Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.