16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని బ్యాన్ చేసేలా ఆస్ట్రేలియా తరహాలో చట్టం చేయాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇంటర్నెట్‌లో అడల్ట్ కంటెంట్ యాక్సెస్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మైనర్లకు అసభ్యకర కంటెంట్ సోషల్ మీడియాలో తేలికగా దొరుకుతోందనే అంశానికి సంబంధించి గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జీ జయచంద్రన్, జస్టిస్ కేకే రామక్రిష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: News Paper : విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం
చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ పెరుగుతోంది
సోషల్ మీడియాలో అసభ్యకరమైన, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ పెరుగుతోందని కోర్టు (Madras High Court) ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు అంతగా ఫలితాలు ఇవ్వడం లేదని ఆరోపించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా అనుసరిస్తున్న సోషల్ మీడియా కనీస వయస్సు విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: