📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Helmet: నాణ్యతలేని హెల్మెట్ల తయారీ, అమ్మకాలపై కేంద్రం కఠిన చర్యలు

Author Icon By Anusha
Updated: July 5, 2025 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల జరిగే మరణాలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల భద్రత దృష్టిలో పెట్టుకుని నాణ్యతా ప్రమాణాలు లేని హెల్మెట్ల తయారవుతున్న,అమ్ముడవుతున్న హెల్మెట్లపై ఉక్కుపాదం మోపింది. అటువంటి హెల్మెట్లను తయారుచేసే సంస్థలు, విక్రయించే రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను (State Governments) ఆదేశించింది. ఐఎస్ఐ మార్క్ ఉన్న, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్ పొందిన హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని ప్రజలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దేశంలో 21 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, రైడర్ల భద్రత అత్యంత ముఖ్యమని ప్రభుత్వం పేర్కొంది. మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని గుర్తుచేసింది. రోడ్ల పక్కన అమ్మే నాణ్యత లేని హెల్మెట్ల వల్ల ప్రమాద సమయంలో ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

హెల్మెట్లను మాత్రమే

నాణ్యమైన హెల్మెట్ల వాడకం ద్వారా తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదాలు తగ్గుతున్నప్పటికీ, ఈ విషయంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.హెల్మెట్ల నాణ్యతను నిర్ధారించేందుకు 2021లోనే కేంద్రం ఒక క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ (Quality Control Order) ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే విక్రయించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 176 సంస్థలకు మాత్రమే నాణ్యమైన హెల్మెట్లు తయారు చేయడానికి బీఐఎస్ లైసెన్సులు ఉన్నాయి.నిబంధనల అమలును పర్యవేక్షించడానికి బీఐఎస్ అధికారులు నిరంతరం ఫ్యాక్టరీలు, మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 500కు పైగా హెల్మెట్ నమూనాలను పరీక్షించగా, బీఐఎస్ మార్క్‌ను దుర్వినియోగం చేస్తున్న వారిపై 30కి పైగా సోదాలు నిర్వహించి, హెల్మెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Helmet: నాణ్యతలేని హెల్మెట్ల తయారీ, అమ్మకాలపై కేంద్రం కఠిన చర్యలు

సోదాలు నిర్వహించి

ఒక్క ఢిల్లీలోనే లైసెన్సులు రద్దయిన 9 సంస్థల నుంచి 2,500కు పైగా నాణ్యత లేని హెల్మెట్ల (Poor quality helmets) ను అధికారులు సీజ్ చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగానికి కేంద్రం ఇప్పటికే లేఖలు రాసింది.ఈ నేపథ్యంలో ప్రజల బాధ్యత మరింత పెరిగింది. తక్కువ ధర చూసి నాణ్యతా ప్రమాణాలు లేని హెల్మెట్లను కొనుగోలు చేయకూడదు. ఐఎస్ఐ గుర్తింపు పొందిన హెల్మెట్‌ (Helmet) ను తప్పనిసరిగా వాడాలి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం నిస్సందేహంగా భద్రతపరంగా శుభపరిణామం. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని గట్టిగా అమలు చేస్తే ద్విచక్ర వాహనదారుల ప్రాణాలు రక్షించబడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Saif Ali Khan: సైఫ్‌ కు చేజారిన రూ.15 వేల కోట్ల ఆస్తులు

#BISHelmets #ConsumerAffairsIndia #FakeHelmetsBan #GovtOfIndia #HelmetAwareness #HelmetRules #HelmetSafety #ISIMark #MotorVehiclesAct #RideSafeIndia #RoadSafetyIndia #SafetyFirst #SubstandardHelmets #TrafficSafety #TwoWheelerSafety Ap News in Telugu BIS certified helmets Breaking News in Telugu consumer affairs ministry India fake helmets ban Google News in Telugu helmet manufacturers penalized helmet regulation India helmet safety India Indian government helmet rules ISI mark helmets Latest News in Telugu Motor Vehicles Act 1988 motorcycle rider protection Paper Telugu News quality helmets mandatory Road safety India substandard helmet crackdown Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Two-wheeler safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.