దేశంలోని 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పిడుగులు, వడగళ్లు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీంతో పాటు మే 8 వరకు ఈ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇప్పటికే పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ ఆలర్ట్, తూర్పు రాజస్థాన్‌కు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఇలా వున్నాయి. మే 6న రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళలో భారీ వర్షం, గాలులు కురుస్తాయని IMD తెలిపింది. మే 7న గుజరాత్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈశాన్య రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు
మే 8న మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని చెప్పింది. జమ్ము కశ్మీర్, లద్ధాఖ్, దక్షిణ తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన మేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం లేదని చెప్పింది. మరోవైపు ఒడిశాలోని మయూర్భంజ్, కియోంజర్, బాలేశ్వర్ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగళ్లు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. బంగాల్, బిహార్ నుంచి అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వివరించింది. దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, తెలంగాణ, కోస్తాంధ్రకు కూడా వర్ష ప్రభావం ఉందని తెలిపింది.
ఈ రాష్ట్రాలకు హిమపాతం సంభవించే ప్రమాదం
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలైన లాహౌల్, కిన్నౌర్‌లో హిమపాతం సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే అలాంటి ప్రాంతాలను సందర్శించకూడదని పర్యటకులు సూచించింది. స్కూళ్లను సైతం మూసి ఉంచాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరగిపడడంతో పాటు వరదలు వచ్చాయి. ఫలితంగా చార్ధామ్ యాత్రికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్‌లో గడిచిన 24 గంటల్లో సుమారు గంటకు 70 నుంచి 100 కిమీ వేగంతో గాలులు వీచాయని తెలిపింది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో 70కిమీ వేగంతో గాలుల వచ్చాయని చెప్పింది.
గాలులు, వడగళ్ల
మరోవైపు పిడుగులు పడే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని సూచించింది. గాలులు, వడగళ్ల నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉండాలని తెలిపింది. ముఖ్యంగా కొండలు, వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనను విరమించుకోవాలని చెప్పింది. రైతులు సైతం పంట రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ఎన్డీఆర్ఎఫ్తో పాటు విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొండ ప్రాంతాల్లో హిమపాతం సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో పర్యటనలు చేయడం, స్కూల్స్‌ను మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించబడింది.
Read Also: Kashmir: కశ్మీర్లో జల విద్యుత్ ప్రాజెక్టుల పునః ప్రారంభం ..