📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bay of Bengal: దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన..పిడుగులు పడే ప్రమాదం

Author Icon By Vanipushpa
Updated: April 5, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అటు కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లోనూ అక్కడక్కడ చెదురుమదురు వర్షపాతం నమోదైంది. తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా కుండపోతగా వర్షాలు కురిశాయి. ఇదే తీవ్రత ఇంకో మూడు రోజుల పాటు కొనసాగుతుందని చెన్నైలోని భారత వాతావరణ ప్రాంతీయ కేంద్రం సూచించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

లోతట్టు ప్రాంతాలు జలమయం
శుక్రవారం నాడు వర్షాల తీవ్రత నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, నాగపట్టణం, కరైకల్‌ జిల్లాల్లో అత్యధికంగా కనిపించింది. కొన్ని గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫర స్తంభించింది. జనం అంధకారంలో గడిపారు. కన్యాకుమారి జిల్లాలోని కోజిపోర్విలైలో 19 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. తిరుప్పూర్‌ నార్త్‌లో 11, కోయంబత్తూర్‌ జిల్లాలోని నంబియూర్‌, సుళ్లూర్‌లల్లో ఎనిమిది సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. ఈరోడ్, రామనాథపురం, మండపం, థొండి, పాంబన్‌లల్లో 7 నుంచి అయిదు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు
థేని, తెన్‌కాశి, రామనాథపురం, కన్యకుమారిల్లో ఈ సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెన్నై ఆర్ఎండీ వెల్లడించింది. తిరునెల్వేలి, తూత్తుకూడి, విరుధునగర్, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, మధురై జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడొచ్చు. ఈ తాజా వర్షాల వల్ల తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది.

READ ALSO: నేడు పిడుగులతో కూడిన వర్షాల

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Heavy rain forecast Latest News in Telugu Paper Telugu News risk of thunderstorms south coastal districts Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.