हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

కోట్లాది ఆస్తిని వదిలేసి సన్యాసంలోకి..

Anusha
కోట్లాది ఆస్తిని వదిలేసి  సన్యాసంలోకి..

మహా కుంభమేళా జనవరి 13న మొదలైన ఫిబ్రవరి 26న మహాశివ రాత్రి రోజున నిర్వహించే చివరి‘అమృతస్నానం’తో ముగియనుంది. ఇప్పటి వరకూ 40 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రపంచం నలుమూలల నుంచి వస్తోన్న భక్తులతో ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం జన సంద్రాన్ని తలపిస్తోంది. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఇప్పటికే కుంభమేళాలో పాల్గొన్నారు. ఆధ్యాత్మక సంగమంలో సాధువులు, యోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భిన్న నేపథ్యం కలిగిన వ్యక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇప్పటికే రుద్రాక్ష బాబా, అంబాసిడర్ బాబా, మహిళా సాధ్వీ, ఐఐటీ బాబా వంటి వారు అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా, ఈ జాబితాలో మరో బాబా చేరారు. ఆయనే వేల కోట్ల ఆస్తులను త్వజించి,సాధువుగా మారిన ‘ బిజినెస్ మ్యాన్’. ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్త,ఇప్పుడు కాషాయం, మెడలో రుద్రాక్షలు ధరించి.. సన్యాసిగా నిరాడంబర జీవితం గడుపుతున్నారు.డబ్బు, ప్రాపంచిక సుఖాలు అంతరంగ సంతోషాన్ని ఇవ్వలేదని, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, అపారమైన సంపద నిజమైన సంతృప్తికి సమానం కాదని చివరికి గ్రహించానని అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కుంభమేళాలో బిజినెస్ మ్యాన్ బాబాగా మారిన వ్యాపారవేత్త’ అనే టైటిల్‌తో పెట్టిన ఆయన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుంభమేళాకు వచ్చిన భక్తులతో ఆయనకు అనుగ్రహ భాషణం చేస్తూ తోటి సాధువులకు రగ్గులు, దుప్పట్లు పంచిపెడుతున్నారు. అవసరమైనవారికి సాయం అందిస్తున్నారు.

Untitled design 2025 02 12T185015.039 2025 02 039c75f47d2cace45768a0f59e07c722 16x9

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి వివిధ రకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతని మార్పును చూసి మక్కువగా ప్రశంసలు వర్షం కురిపిస్తుండగా, మరికొందరు ఆ పరిణామాన్ని అనుమానాస్పదంగా చూస్తున్నారు.వీడియోను వీక్షించిన ఓ వ్యక్తి, ‘ఆయన బహుశా నిజమైన పేదరికాన్ని ఎప్పుడూ అనుభవించి ఉండరు.. అందుకే సంపదలో ఆనందాన్ని ఆయన గుర్తించలేకపోయారు,అతను కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది అని ఇంకొకరు విమర్శించారు.

ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక జీవన మార్గం
అతని కథనం ఆధునిక సమాజానికి వినిపించాల్సిన సందేశమని పలువురు చెబుతున్నారు. సంపద, లగ్జరీ జీవితాల కన్నా, ఆధ్యాత్మిక జీవన మార్గంలో మనశ్శాంతి దొరికే విషయాన్ని ఈ బిజినెస్ మ్యాన్ బాబా తన జీవితానుభవంతో తెలియజేస్తున్నారు.

మహా కుంభమేళా భక్తుల రద్దీతో కిక్కిరిసిన త్రివేణి సంగమం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తుల సందడితో మారుమోగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా సంగమం, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున చివరి అమృతస్నానంతో ముగియనుంది. ఇప్పటివరకు 40 కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870