📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

సింగపూర్ కంపెనీ చేతికి హల్దిరామ్స్.. టాటాతో సహా బడా కంపెనీల క్యూ..

Author Icon By Vanipushpa
Updated: March 13, 2025 • 2:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ స్నాక్స్ అండ్ స్వీట్స్ తయారీ సంస్థ హల్దిరామ్‌లో వాటాను సొంతం చేసుకునేందుకు చాల కంపెనీలు పోటీ పడ్డాయి. కానీ వీటన్నిటిని అధిగమించి సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడి సంస్థ టెమాసెక్ ముందంజ వేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, టెమాసెక్ హల్దిరామ్ స్నాక్స్ వ్యాపారంలో దాదాపు 10% వాటాను $1 బిలియన్లకు కొనుగోలు చేసింది అంటే మన భారతీయ రూపాయలలో 100 కోట్లు. చాలా నెలల చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం హల్దిరామ్ మొత్తం వాల్యూ దాదాపు $10 బిలియన్లుగా అంచనా వేసింది.

టెమాసెక్ స్పందించేందుకు నిరాకరించిన

అయితే దీనికి సంబంధించి టెమాసెక్ స్పందించేందుకు నిరాకరించింది. అలాగే కంపెనీ దీనిని మార్కెట్ ఊహాగానాలుగా అభివర్ణించింది. దీనిపై హల్దిరామ్ సీఈఓ కృష్ణ కుమార్ చుటాని కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. హల్దిరామ్‌లో వాటాను కొనుగోలు చేయడానికి టెమాసెక్, బెయిన్ క్యాపిటల్‌తో కలిసి బిడ్ వేసింది. కానీ తరువాత బెయిన్ కాపిటల్ బిడ్ నుండి వెనక్కి తగ్గింది. దీని తరువాత, టెమాసెక్ ఒంటరిగా ప్రమోటర్ అగర్వాల్ కుటుంబంతో చర్చలు జరిపింది. టెమాసెక్ కాకుండా ఆల్ఫా వేవ్ గ్లోబల్ కూడా ఈ రేసులో ఉంది.

ఎవరు ప్రయత్నించారు

హల్దిరామ్‌లో 10-15% వాటా కోసం మూడు గ్రూపులు బైండింగ్ ఆఫర్‌లను ఇచ్చాయని ET మొదట డిసెంబర్ 7న నివేదించింది. వీటిలో బ్లాక్‌స్టోన్ నేతృత్వంలోని కన్సార్టియం, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ అండ్ సింగపూర్ GIC, టెమాసెక్-బెయిన్ కన్సార్టియం ఇంకా ఆల్ఫా వేవ్ నేతృత్వంలోని కన్సార్టియం ఉన్నాయి. ప్రమోటర్ కుటుంబం $10-11 బిలియన్ల వాల్యూ కోరుకుంటుండగా బెయిన్ క్యాపిటల్ $8.8-9.4 బిలియన్లకు మించి వెళ్లడానికి ఇష్టపడలేదు. హల్దిరామ్‌ను కొనుగోలు చేయడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపించాయి. 2016-17 నుండి జనరల్ అట్లాంటిక్, బెయిన్ క్యాపిటల్, క్యాపిటల్ ఇంటర్నేషనల్, టిఎ అసోసియేట్స్, వార్‌బర్గ్ పింకస్ అండ్ ఎవర్‌స్టోన్ వంటి చాల ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఈ కంపెనీలో వాటా కోసం అగర్వాల్ కుటుంబంతో చర్చలు జరుపుతున్నాయి.

ఒక చిన్న షాపుతో హల్దిరామ్స్

మరోవైపు కెల్లాగ్స్ అండ్ పెప్సికో హల్దిరామ్స్‌లో 51% లేదా అంతకంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేయడానికి సుదీర్ఘ చర్చలు జరిపాయి. గత సెప్టెంబర్‌లో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇలాంటి ఆఫర్‌ను ఇచ్చింది కానీ $10 బిలియన్ల వాల్యుయేషన్‌తో వెనక్కి తగ్గింది. 1937లో రాజస్థాన్‌లోని బికనీర్ నగరంలో ఒక చిన్న షాపుతో హల్దిరామ్స్ ప్రారంభమైంది, భారతదేశపు $6.2 బిలియన్ల టేస్టీ స్నాక్స్ మార్కెట్‌లో దాదాపు 13% వాటాతో ఉంటుందని యూరోమానిటర్ ఇంటర్నేషనల్ అంచనా వేసింది. ఈ స్నాక్స్ వ్యాపారం చాలా మంది విదేశీ పెట్టుబడిదారులను కంపెనీ షేర్ కొనేందుకు ఆకర్షించింది కూడా. హల్దిరామ్ అత్యంత ప్రజాదరణ పొందిన చిరుతిండిలలో ఒకటి ఆలు భుజియా అండ్ ఆలు భుజియా. దీనిని పిండి, మాసాలు ఇంకా ఇతర కలిపి తయారు చేసిన ఒక టేస్టీ చిరుతిండి. చిన్న చిన్న షాపుల నుండి పెద్ద పెద్ద స్టోర్స్ వరకు కేవలం 10 రూపాయల నుండి తక్కువ ధరకే లభిస్తుంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Haldirams in the hands of a Singapore company. Latest News in Telugu Paper Telugu News Queue of big companies including Tata.. Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.