📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest News: H-1B Visa – H-1Bలో టాప్‌లో ఉన్న కంపెనీలు తెలుసా?

Author Icon By Anusha
Updated: September 22, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది అమెరికాలో H-1B వీసా (H-1B Visa) ల దరఖాస్తుల్లో అమెజాన్, TCS, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు దూకుడు చూపాయి. అమెజాన్ ముందుండి 10,044 H-1B వీసాలు పొందింది. ఇదే సమయంలో ఇండియన్ IT ఫార్మ్ TCS (Tata Consultancy Services) 5,505 వీసాలతో రెండో స్థానాన్ని సంపాదించింది. ఈ లిస్ట్‌లో భారతీయ IT కంపెనీల ప్రాముఖ్యత ఇప్పటికే గుర్తించబడిన విషయం, కానీ ఈసారి సంఖ్యల ఆధారంగా స్పష్టంగా దర్శించబడింది.

ఈ హై-డిమాండ్ వీసాల్లో భారతీయ IT కంపెనీల భాగస్వామ్యం, గ్లోబల్ IT మార్కెట్‌లో భారత సాఫ్ట్‌వేర్ సేవల ప్రభావాన్ని మరింత బలపరుస్తుంది. ఆఫ్షోరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో భారతీయ కంపెనీల నైపుణ్యం H-1B వీసాల ద్వారా అమెరికా మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తుంది.

టాప్ లిస్టులో

ఇక టాప్ లిస్టులో మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123, యాపిల్ 4,202, గూగుల్ 4,181, డెలాయిట్ 2,353, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా అమెరికాస్ 951 వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. అంటే టాప్ టెన్‌లో సగం వరకు భారతీయ ఐటీ కంపెనీలే.

కానీ, ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా H-1B వీసా పై సంవత్సరానికి $100,000 ఫీజు అని ప్రకటించడం. “కొంతమంది వలస కార్మికుల ప్రవేశంపై పరిమితి” పేరుతో సంతకం చేసిన ఈ ప్రొక్లమేషన్ “సెప్టెంబర్ 21, 2025” అంటే ఈరోజు నుంచీ అమల్లోకి వస్తుంది.

ఐటీ కంపెనీలు టెన్షన్‌లోకి వెళ్లిపోయాయి

కనీసం ఏడాది పాటు ఇది కొనసాగుతుంది, తర్వాత పొడిగించే అవకాశం కూడా ఉంది. ఇది వినగానే ఇండియన్ ఐటీ కంపెనీలు టెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. ఎందుకంటే అమెరికాలో స్పెషలైజ్డ్ రోల్స్ కోసం భారతీయ ఇంజినీర్ల పై బాగా ఆధారపడి ఉంటాయి. ఇక కొత్త ఫీజు వల్ల కంపెనీలకు ఖర్చులు పెరగడం ఖాయం.అమెరికా ప్రభుత్వం (US government) మాత్రం తన వైపు నుండి లాజిక్ చెబుతోంది.

2000లో అమెరికాలో ఉన్న విదేశీ STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) వర్కర్లు 1.2 మిలియన్లు కాగా, 2019కి అది దాదాపు “2.5 మిలియన్లకు రెట్టింపు” అయిందట. అదే సమయంలో STEM జాబ్స్ 44.5% మాత్రమే పెరిగాయి. కంప్యూటర్, మ్యాథ్స్ జాబ్స్‌లో విదేశీయుల శాతం “17.7% నుంచి 26.1%” కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.

అమెరికన్ ఉద్యోగులకి నష్టం అవుతోందనే

అలాగే, H-1B సిస్టమ్‌ని చాలా ఐటీ కంపెనీలు “దుర్వినియోగం” చేశాయని ట్రంప్ ప్రభుత్వం నేరుగా ఆరోపిస్తోంది. అమెరికన్ వర్కర్లను లేఆఫ్ చేసి, మరోవైపు చవకగా H-1B వర్కర్లను తీసుకున్నారని చెబుతున్నారు.

H-1B Visa

నిజానికి ఒక అధ్యయనం ప్రకారం, “ఎంట్రీ-లెవెల్ H-1B ఉద్యోగులు అమెరికన్ ఫుల్‌టైమ్ వర్కర్ల కంటే 36% తక్కువ వేతనంతో” పనిచేస్తారట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఈ వీసా సిస్టమ్ (Visa system) కంపెనీలకు లాభమే కానీ అమెరికన్ ఉద్యోగులకి నష్టం అవుతోందనే భావనతోనే ట్రంప్ ఈ కొత్త ఫీజు తీసుకొచ్చారు.

కొత్త ట్రెండ్‌ను ఉత్పన్నం చేస్తుంది

వచ్చే ఏడాది H-1B ఆధారపడిన భారతీయ కంపెనీలు ఈ అదనపు ఖర్చును ఎలా మేనేజ్ చేస్తాయి? అమెరికాలో అవకాశాలు వేటికవే మారుతాయా. ఇంకోక పక్క $100,000 కొత్త ఫీజు కారణంగా, చిన్న-మధ్యస్థ ఐటీ కంపెనీలు అమెరికాలో H-1B వీసా రోల్స్ తగ్గించవచ్చని అనుకుంటున్నారు.

అందువల్ల, కొంతమంది నిపుణులు అమెరికా వెళ్లకుండానే రిమోట్‌గా పని చేయడం ప్రారంభిస్తారు, ఇది “వలస లేకుండా గ్లోబల్ టాలెంట్” అనే కొత్త ట్రెండ్‌ను ఉత్పన్నం చేస్తుంది. ఫలితంగా, భారతీయ కంపెనీలకు ఖర్చులు తగ్గుతాయి, అలాగే భారతదేశంలోనే బిజినెస్ ను విస్తరించడానికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి.

భారతీయ ఐటీ ఫార్మ్స్ కొత్త అవకాశాలు

కొత్త $100,000 ఫీజు వల్ల, అమెరికా కంపెనీలు ఆటోమేషన్, AI సాధనాలు, మరియు అవుట్సోర్సింగ్ పై ఎక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు. దీని వల్ల భారతీయ ఐటీ ఫార్మ్స్ కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉండడం తోపాటు, కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తాయి. అంటే, ఇది భారతీయ IT కోసం లాభం-నష్టం రెండూ కలిపిన సిట్యువేషన్ అని చెప్పుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-pak-i-want-to-win-for-the-team-abhishek-sharma/international/551661/

amazon Apple Breaking News Google H1B visa Indian IT companies Infosys latest news Meta Microsoft TCS Tech Mahindra Telugu News wipro

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.