हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: GST – జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే.. మంత్రుల బృందం గ్రీన్‌ సిగ్నల్‌

Sudha
Latest Telugu News: GST – జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే.. మంత్రుల బృందం గ్రీన్‌ సిగ్నల్‌

వస్తు-సేవ‌ల పన్ను (GST) విధానంలో ఉన్న 4‑స్లాబుల ఆకృతి (5%, 12%, 18%, 28%)ను సింప్లిఫై చేయాలనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు, మంత్రుల బృందం (GoM) 12% మరియు 28% స్లాబులు తొలగించి, కేవలం 5% & 18% స్లాబులు ఉండాలని ఆమోదం తెలిపింది.గురువారం జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. మార్కెట్‌లోని దాదాపు అన్ని వస్తూత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి. అయితే, 5, 18శాతం స్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబ్‌లను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం తాజాగా ఆమోదం (approval) తెలిపింది. ఆల్ట్రా లగ్జరీ, సిన్‌ గూడ్స్‌ (సిగరెట్లు వంటివి)పై 40 శాతం పన్ను విధించడం కూడా కేంద్ర ప్రతిపాదనలో ఉందని యూపీ ఆర్థికమంత్రి సురేష్‌ కుమార్‌ ఖన్నా తెలిపారు. 12 శాతం స్లాబులోని 99 శాతం వస్తూత్పత్తులు 5 శాతంలోకి, 28 శాతం స్లాబులోని 90 శాతం వస్తూత్పత్తులు 18 శాతంలోకి రానున్నట్లు తెలిసింది.

GST - జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే.. మంత్రుల బృందం గ్రీన్‌ సిగ్నల్‌
GST – జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే.. మంత్రుల బృందం గ్రీన్‌ సిగ్నల్‌

ప్రస్తుతం జీఎస్టీలో (GST) కనీస పన్ను 5 శాతం స్లాబులో రోజువారీ నిత్యావసర వస్తూత్పత్తులున్నాయి. ఇక స్టాండర్డ్‌ గూడ్స్‌పై 12 శాతం, ఎలక్ట్రానిక్స్‌, ఆయా రకాల సేవలపై 18 శాతం, పొగాకు, ఇతర విలాసవంతమైన ఐటమ్స్‌పై గరిష్ఠంగా 28 శాతం పన్నులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అదనంగా పాన్‌ మసాలా, లగ్జరీ కార్లు తదితరాలపై జీఎస్టీ (GST)నష్టపరిహార సెస్సును కూడా విధిస్తున్నారు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేయడానికే ఈ సెస్సు. అలాగే కొన్ని నిత్యావసరాలకు జీఎస్టీ మినహాయింపుండగా.. ప్రత్యేకంగా వజ్రాలు, సానబెట్టిన రత్నాలు, బంగారంపై 0.25 శాతం నుంచి 3 శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు.

జనాలపై తగ్గినా జీఎస్టీ భారం

ఇప్పుడున్న జీఎస్టీ స్లాబుల్లో 18 శాతం చాలా కీలకం. జీఎస్టీ వసూళ్లలో ఈ ఒక్క స్లాబు నుంచి వచ్చే ఆదాయం వాటానే 65 శాతంగా ఉన్నది. జీఎస్టీ 2.0లో ఈ స్లాబును యథాతథంగానే ఉంచుతుండటం గమనార్హం. అంటే ప్రస్తుతం ఈ స్లాబులో ఉన్న వస్తూత్పత్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయానికి ఢోకా లేదన్నమాట. ఫలితంగా వాటి వినియోగదారులకు ఇకపైనా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఎంతకు కొంటున్నారో.. కొత్త జీఎస్టీ విధానంలోనూ వాటి కోసం అంతే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మోదీ సర్కారు గొప్పగా జనాలపై జీఎస్టీ భారాన్ని తగ్గించబోతున్నామని, దీపావళి కానుక అంటూ ఊదరగొడుతుండటం అంతా ఉత్తదే. మెజారిటీ వినియోగదారులకు జీఎస్టీ స్లాబుల తగ్గింపు వల్ల ఒనగూరుతున్నదేమీ లేదన్నది తేటతెల్లమైపోయింది. అలాగే ప్రస్తుతం పేద, మధ్య తరగతి వర్గాలు కొంటున్న 5 శాతం స్లాబులోని వస్తూత్పత్తులపై పన్ను భారం అలాగే ఉంటుంది.

GST - జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే..  మంత్రుల బృందం  గ్రీన్‌ సిగ్నల్‌
GST – జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే.. మంత్రుల బృందం గ్రీన్‌ సిగ్నల్‌

విలువైన వస్తూత్పత్తులపై జీఎస్టీ యథాతథం

ఇక పొగాకు, ఆన్‌లైన్‌ గేమింగ్స్‌, లగ్జరీ బైకులు, కార్లు ఇతర వస్తూత్పత్తులపై గరిష్ఠంగా 40 శాతం జీఎస్టీ ఉండనే ఉంటున్నది. దీంతో కొత్త జీఎస్టీ విధానం వచ్చి పన్ను స్లాబులు తగ్గినా మొత్తం పన్ను భారం మాత్రం ఇప్పుడున్నట్టుగానే ఆయా కొనుగోలుదారులపై 88 శాతంగానే ఉంటుందన్న అంచనాలున్నాయి. దీంతో 12 శాతం, 28 శాతం స్లాబులను తీసేయడం వల్ల నష్టపోతున్న ఆదాయం అంతంత మాత్రమేనని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిజానికి జీఎస్టీ వసూళ్లలో ఇప్పుడు 12 శాతం స్లాబు ద్వారా 5 శాతం, 28 శాతం స్లాబు ద్వారా 11 శాతం ఆదాయమే వస్తున్నది. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ స్లాబుల తగ్గింపు జిమ్మిక్కులకు ఈ లెక్కలన్నీ నిదర్శనం. అలాగే బంగారం, వజ్రాలు, ఇతర విలువైన రత్నాలపై జీఎస్టీ యథాతథంగానే ఉండనున్నది. దీంతో స్థూలంగా జీఎస్టీ స్లాబుల సవరణతో సగటు సాధారణ వినియోగదారునికి కేంద్రంలోని మోదీ సర్కారు చేకూర్చే లబ్ధి ఏమీ లేదని తేలిపోయింది.

జిఎస్టిని మొదట ప్రవేశపెట్టింది ఎవరు?

ఈ భావనను మొదట 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నాయకత్వంలో జూలై 1, 2017న జిఎస్‌టి విజయవంతంగా అమలు చేయబడింది, ఇది భారతదేశ పన్ను సంస్కరణల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

జీఎస్టీలో ఎన్ని స్లాబ్లు ఉన్నాయి?

ఇప్పుడు మనం GST రేటు హేతుబద్ధీకరణకు సిద్ధంగా ఉన్నాము, 5, 12, 18 మరియు 28% అనే నాలుగు ప్రధాన రేటు స్లాబ్‌లు 5 మరియు 18% అనే రెండు స్లాబ్‌లకు దారితీసే అవకాశం ఉంది. 

పన్ను శ్లాబులు ఎన్ని?

2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను విధానం కింద ప్రతిపాదిత ఆదాయపు పన్ను స్లాబ్‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి: రూ. 0- రూ. 4 లక్షలు నిల్ టాక్స్, రూ. 4 లక్షలు మరియు రూ. 8 లక్షలు – 5%, రూ. 8 లక్షలు మరియు రూ. 12 లక్షలు – 10%, రూ. 12 లక్షలు మరియు రూ. 16 లక్షలు – 15%, రూ. 16 లక్షలు మరియు రూ. 20 లక్షలు – 20%, రూ. 20 లక్షలు మరియు రూ. 24 లక్షలు – 25% మరియు రూ. 24 లక్షలకు పైన – 30%

Read hindi news: vaartha.com

Read Also:

https://vaartha.com/insurance-recommendation-to-abolish-gst/national/533753/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870