Android Emergency Location Service: భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్ల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా గూగుల్ (Google) కీలక అడుగు వేసింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలకు వేగంగా సమాచారం చేరేలా రూపొందించిన ‘ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్’ (ELS)ను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌ను తమ 112 ఎమర్జెన్సీ వ్యవస్థతో పూర్తిగా అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని గూగుల్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది.
Read also: Satya Nadella: AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా
112 కాల్ చేస్తే చాలు.. లొకేషన్ స్వయంచాలకంగా షేర్
ఈ సాంకేతిక సదుపాయం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల(Mobile phones)లో ముందే అమర్చబడి ఉంటుంది. ఎవరైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయగానీ, సందేశం పంపగానీ చేసిన వెంటనే, ఆ వ్యక్తి ఉన్న ప్రదేశానికి సంబంధించిన కచ్చితమైన లొకేషన్ వివరాలు ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేంద్రాలకు చేరుతాయి. ఇందుకోసం ఫోన్‌లోని జీపీఎస్, వైఫై, మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్‌ను సమన్వయంగా ఉపయోగిస్తుంది. దీంతో సుమారు 50 మీటర్ల పరిధిలోనే బాధితుడి స్థానాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది.
ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే, కాల్ చేసిన వెంటనే కనెక్షన్ అంతరాయం ఏర్పడినా కూడా లొకేషన్ వివరాలు ఇప్పటికే ఎమర్జెన్సీ కేంద్రానికి చేరిపోతాయి. దీంతో సహాయక బృందాలు సమయాన్ని వృథా చేయకుండా వెంటనే సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారుల గోప్యతకు పూర్తిస్థాయి రక్షణ ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. ఈ సదుపాయం కేవలం ఎమర్జెన్సీ కాల్స్ లేదా సందేశాల సమయంలో మాత్రమే యాక్టివ్ అవుతుందని, లొకేషన్ డేటా నేరుగా అధికారిక సహాయక కేంద్రానికే చేరుతుందని, ఆ సమాచారాన్ని గూగుల్ ఎలాంటి విధంగా కూడా భద్రపరచదని తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లో మొదటగా ప్రారంభమైన గూగుల్ ELS సర్వీస్
ఈ సేవను వినియోగించేందుకు ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే అదనపు హార్డ్‌వేర్ కూడా అవసరం లేదు. ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే పై వెర్షన్ ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఇది ఉచితంగా పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో అధికారిక ప్రారంభానికి ముందు ఈ సర్వీస్‌ను కొన్ని నెలల పాటు పైలట్ ప్రాజెక్ట్‌గా పరీక్షించారు. ఆ సమయంలో సుమారు రెండు కోట్ల అత్యవసర కాల్స్, సందేశాలకు ఈ సిస్టమ్ ద్వారా లొకేషన్‌ను విజయవంతంగా గుర్తించినట్లు గూగుల్ వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: