📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయం అభివృద్ధిపై దృష్టి పెట్టిన జిఎంఆర్ సంస్థ

Author Icon By Vanipushpa
Updated: April 15, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశరాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ 2 మూతపడింది.. టెర్మినల్ 2…. ఇతర రెండు టెర్మినల్స్ (టీ1, టీ3) తో పోలిస్తే నాణ్యత ప్రమాణాల్లో వెనుకబడి ఉందని ప్రయాణీకుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయ అభివృద్ధిపై దృష్టి పెట్టింది జిఎంఆర్ సంస్థ. ప్రస్తుతం టెర్మినల్-2 ఆధునీకరణ, నిర్మాణ పనుల కారణంగా టెర్మినల్ 2 ఆపరేషన్స్ నిలిపివేశారు అధికారులు. మూడున్నర నెలల పాటు జులై 31 వరకు T2 టెర్మినల్ మూసి ఉండనుంది. ఈ టెర్మినల్‌ను మరింత అధునాతనంగా మార్చేందుకు విస్తృతమైన పునరుద్ధరణ పనులు చేపట్టాలని విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహిస్తున్న సంస్థ జీఎంఆర్ గ్రూపు భావించింది. ప్రస్తుతం అభివృద్ధి పనుల్లో సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజీ కియోస్క్‌లు, బ్యాగేజీ నిర్వహణ వ్యవస్థలు, సెల్ఫ్-చెక్-ఇన్ సౌకర్యాలు వంటివి ఉన్నాయి.

విమాన సర్వీసులకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు
ఈ మార్పుల తర్వాత టెర్మినల్-2ను అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించే టెర్మినల్-3 (T3)కు కొనసాగింపుగా.. లేదా గతంలో మాదిరి డొమెస్టిక్ సేవల కోసం వినియోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతిరోజూ T2 నుంచి 270 విమానాలు ఆపరేషన్స్ నిర్వహిస్తాయి..ఇప్పుడు ఇవన్నీ T1 నుంచి సేవలను కొనసాగించనున్నాయి. T1 టెర్మినల్ లో ప్రయాణికుల రద్దీ పెరగకుండా విమాన సర్వీసులకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు ఎయిర్‌పోర్ట్ అధికారులు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు‌గా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ విమానాశ్రయంలో మొత్తం మూడు టెర్మినళ్లు ఉన్నాయి.
టాప్ ఎయిర్ పోర్టుగా ఢిల్లీ విమానాశ్రయం
ఇందులో టెర్మినల్-1, టెర్మినల్-2 నుంచి దేశీయ విమాన సర్వీసులు నడుస్తుండగా.. టెర్మినల్-3లో డొమెస్టిక్‌తో పాటు ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ మూడు టెర్మినళ్లలో 2, 3 టెర్మినళ్లు ఒకదానికి ఆనుకుని మరొకటి పక్కపక్కనే ఉన్నాయి. రెండింటికీ ప్రత్యేక ఎయిర్‌పోర్ట్ లైన్ మెట్రో రైల్ సదుపాయం కూడా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల్లో ఒకటిగా.. వరుసగా ప్రపంచ ర్యాంకింగ్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక హంగులతో ఉండే ఈ విమానాశ్రయంలో సేవల్లో నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ప్రయాణికులకు సులభతరమైన చెక్ ఇన్ సేవలు అందించడం వంటివి ఎన్నో ఇక్కడ లభ్యమవుతాయి. చేతిలో ఎలాంటి ధృవపత్రాలను చూపించాల్సిన అవసరం లేకుండా డిజియాత్ర వంటి టెక్నాలజీతో ప్రయాణికుడి మొబైల్ ఫోన్, ముఖం స్కాన్ చేయడం ద్వారా అతడి గుర్తింపును నిర్ధారించుకుని గేట్లు తెరుచుకునే సదుపాయం కూడా ఇక్కడ ఉంది.
రెండు టెర్మినళ్లపై ఎలాంటి అదనపు భారం ఉండదు
టీ-2 మూసివేతతో, ఈ టెర్మినల్ నుంచి నడిచే 122 ఇండిగో విమానాలు టెర్మినల్ 1 (టీ1) కి మారనున్నాయి. ఈ మధ్యనే టెర్మినల్-1ను విస్తరించడంతో పాటు మరింత ఆధునీకరించిన విషయం తెలిసిందే. తద్వారా టెర్మినల్-1 నిర్వహణ సామర్థ్యం కూడా పెరిగింది. అంటే టెర్మినల్-2 మూసివేత కారణంగా ఇతర రెండు టెర్మినళ్లపై ఎలాంటి అదనపు భారం ఉండదు

ప్రపంచ స్థాయి హబ్‌గా ..

అయితే టెర్మినల్-1 ఆధునీకరణ తర్వాత ఏటా 40 మిలియన్ల మంది ప్రయాణీకులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. టీ2 నుంచి టీ1 కి విమానాల మార్పు కారణంగా, ప్రయాణీకులు తమ ఎయిర్‌లైన్స్‌తో ముందుగానే సంప్రదించి, విమాన షెడ్యూల్, టెర్మినల్ సమాచారాన్ని ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే చివరి నిమిషంలో ఉరుకులు పరుగులతో తమ విమానాలను మిస్సయ్యే ప్రమాదం ఉంది. ఢిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్, బహుళ దశల్లో అభివృద్ధి పనులను చేపడుతోంది. కామన్వెల్త్ గేమ్స్ ముందు టీ-3 నిర్మాణం, 4వ రన్‌వే, భారతదేశంలో మొట్టమొదటి ఎలివేటెడ్ క్రాస్ టాక్సీవే వంటి అనేక ప్రాజెక్టులను పూర్తి చేసింది.

Read Also: Online Fraud: ఆన్ లైన్ మోసగాడికి చుక్కలు చూపెట్టిన యువతీ..వీడియో వైరల్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu GMR focuses Google News in Telugu Latest News in Telugu on development of Delhi airport Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.