Global Developments : ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ భూగోళం పై ఏ చిన్న పరిణామం సంభవించినా, దాని ప్రభావం మొత్తం దాదాపు 850 కోట్ల మానవులపై ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రకృతి కన్నెర్ర చేసినా, అధి పత్య పోరులో సామ్రాజ్యవాద దాడులైనా, కల్తీలైన సామా న్య మానవుల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి ఆ మాటకు వస్తే, సబ్ సహారా, ఆసియా, ఆఫ్రికా ఖండ ప్రజల జీవితాలు అ కల్లోలం అవుతున్నాయి. ముఖ్యంగా 1991 తరువాత సరళీ కృత ఆర్ధిక విధానాలు, సోవియట్ యూనియన్ విడిపో వడం, ప్రపంచీకరణ నేపథ్యంలో అనేకరంగాల్లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి తోడు వరదలు, భూకంపాలు, సునామీలు, అగ్ని ప్రమాదాలు, తరచూ యుద్ధాలు, కోవిడ్ విలయతాండవం మొత్తం ప్రపంచాన్ని ఏ సమయానికి ఏ వైపుకు నెడుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. 1990 వరకూ A సోవియట్ యూనియన్ (రష్యా) బలంగా ఒకవైపు, మరోవైపు అమెరికా ఒకదానికి ధీటుగా మరొకరు ఉండటం వల్ల దాదాపు ప్రపంచ దేశాలు సమన్వయం చేసుకుంటూ సామరస్యంగా సాగింది. ఎప్పుడైతే రష్యా తన ప్రభా వాన్ని కోల్పోయిందో. ఇక తిరుగులేని శక్తిగా అమెరికా అవిర్భవిం చింది.
Read Also : US Tariffs on India : భారత్‌కు ఊరట: రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా సవరణ
Global Developments : పేద మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం
గతంలో ఇరాక్, లిబియా వంటి దేశాలను, తాజాగా వెనుజులా, నేడు ఇరాన్ పై సామ్రాజ్యవాద ఆధిపత్యం ధోరణితో దాడులు, యుద్ధాలు చేస్తూ సహ మొత్తం ప్రపంచాన్ని ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేద మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతూ, జీవితాలను చింద రవందరగా చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడుగా రెండోవ సారి బాధ్యతలు. చేపట్టిన ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే భావనతో మొత్తం ప్రపంచ దేశాలపైట్రేడ్ వార్’ కు శ్రీకారం చుట్టాడు. తనకు నచ్చిన విధంగా ప్రతీకార సుంకాలు విధిస్తూ ప్రపంచ దేశాలపై అప్రకటిత వాణిజ్య యుద్ధానికి సిద్ధ పడటం వల్ల దాదాపు అన్ని దేశాలు అమెరికాకు దూరం జరిగాయి. చివరికి చిన్న చితకా దేశాలైన కొలంబియా, మెక్సికో వంటి దేశాలు ట్రంప్ విధా నాల పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. మన దేశం అలీన విధానం 4 విడనాడటం, ట్రంప్ తో సన్నిహితంగా ఉండటం వల్ల పెను నవాళ్లను ఎదుర్కోవడం జరుగు తుంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పర్యావరణ పరిరక్షణ వేదికలు నుంచి అమెరికా బయటకు పోవడం కూడా మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపోయేటట్లు చేసింది. దీంతో నిధులు లేక పేద మధ్యతరగతి ప్రజలు, ముఖ్యం గా ఆఫ్రికన్ దేశాలు ఆహర కొరత, ఆరోగ్య సంరక్షణ కార్య క్రమాలు స్త్రీ అందక బహు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి.
ప్రజాస్వామ్య పద్ధతిలోనే గుణపాఠం చెప్పాలి
ఇక అమెరికా, ఇజ్రాయెల్ జోడిగా ఇరాన్, లెబనాన్ పై చేస్తున్న యుద్ధం పరాకాష్టకు చేరడంతో మొత్తం ఆ యుద్ధ తీవ్రత మన ఇంటికి, పరిశ్రమలకు, ఎరువులు, మందులు ఫార్మా రంగంతోపాటు మందుబాబులు (మద్యం) గుండెల్లో గుబులు రేపుతోంది. తిరిగి మరల పుల్లల పొయ్యిలు, బొగ్గులు పొయ్యులు బయటికి తీసి బ్రతుకులు గడిపే సమయం ఆసన్నమైంది. పేద, మధ్య తరగతి ప్రజలు దాచుకున్న సొములు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు హుష్ కాకి అవుతున్న పరిస్థితి, అధికధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, గాలిలో కలిసిపోతున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవి అన్నీ సామాన్య ప్రజల జీవితాల్లో చీకటి నింపుతున్నాయి. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు, వాతావరణ కాలుష్యం చుట్టుముట్టుతున్నది. అక్రమ దందాలు, కల్తీలు, బ్లాక్ మార్కెట్ స్వైరవిహారం చేస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తు న్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒకటై, సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణితో వెళుతున్న అమెరికా వంటి దేశానికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే గుణపాఠం చెప్పా లి. మనలాంటి దేశాలు ముందస్తు ప్రణాళిక 20 సిద్ధం చేసుకుని ‘విశ్వగురు’ పాత్ర పోషించాలి. ఉత్సవ విగ్రహాంగా మారు తున్న ఐక్యరాజ్యసమితికి పునర్జీవం పోయాలి. ఎంత అభి వృద్ధి చెందిన దేశమైనా ఏదో ఒక విషయంలో మరో దేశం పై ఆధారపడి ఉంటుంది అనే వాస్తవాన్ని సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ ఆధిపత్య దేశాలకు తెలియజేయాలి. ఎక్కడో అంతరిక్షంలో మానవ ఉనికికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈదేశాలు, అసలు భూమ్మీద కళ్ళముందు కదలాడే మానవ జాతి నిర్మూలనకు, పసి పిల్లలు ప్రాణాలు సైతం యుద్ధాలు పేరుతో చంపివేయడం ఏరకమైన అభివృద్ధి ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఇకనైనా ఆలోచన చేయాలి.
-పి.వి.వి. సత్యనారాయణ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: