हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Minister: ఆత్మాహుతి బాంబు ఇవ్వండి పాక్​పై దాడి చేస్తా :కర్ణాటక మంత్రి

Anusha
Minister: ఆత్మాహుతి బాంబు ఇవ్వండి పాక్​పై దాడి చేస్తా :కర్ణాటక మంత్రి

జమ్ము కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దాయాది దేశాన్ని గట్టిగా దెబ్బ కొట్టాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పీఓకేను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కొందరు, ముష్కరులను దారుణంగా హతమార్చాలని మరికొందరు అంతర్జాతీయ వ్యాప్తంగా చెప్పుకొస్తున్నారు. ఈక్రమంలోనే కర్ణాటకకు చెందిన మంత్రి బీ జెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మాహుతికి ఓ బాంబ్ ఇస్తే తానే పాకిస్థాన్ వెళ్లి దాడి చేస్తానన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

కఠిన చర్య

ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు 22 మంది అమాయక పర్యటకుల ప్రాణాలు తీశారు. ఆపై అడవుల్లోకి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి భారత బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా వారిని వెతుకుతున్నాయి. ఈక్రమంలోనే దాయాది దేశంపై భారత్ పగ తీర్చుకునేందుకు అనేక కఠిన చర్యలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు పాక్ పౌరులను ఆ దేశానికి పంపించి వేస్తోంది. ఈక్రమంలోనే అంతర్జాతీయ వ్యాప్తంగా పాకిస్థాన్‌కు గట్టి బదులు ఇవ్వాలని ఇండియాకు సూచిస్తున్నారు. పీఓకేను కూడా స్వాధీనం చేసుకోవాలని చెబుతున్నారు.దీంతో పాకిస్థాన్ మరింత అప్రమత్తం అయింది. భారత్ దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలి, ఎలా తప్పించుకోవాలని చూస్తోంది.ఇలాంటి సందర్భంలోనే కర్ణాటకకు చెందిన మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే అని అన్నారు. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవని వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అందుకోసం తాను ఆత్మాహుతి చేసుకోవడానికైనా రెడీ అని వివరించారు.

వ్యతిరేకంగా

కేంద్ర ప్రభుత్వాన్నే నేరుగా ఆత్మాహుతి కోసం ఒక బాంబు ఇవ్వమని మంత్రి బీ జెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ కోరారు. అంతకుముందు కూడా పహల్గాం దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఇది చాలా హేయమైన చర్య అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనం అంతా ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా అనేక మంది ఈయనను సమర్థిస్తున్నారు. మేము కూడా మీతో వస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. పాకిస్థాన్‌పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని, 26 మంది ప్రాణాలు తీసిన ముష్కరులను నరకం చూపించాలని వివరిస్తున్నారు.

Read Also: USA: రియల్ ఐడీ లేకపోతే విమానంలో కి నో ఎంట్రీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870