📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

మహిళలకు తక్కువ వడ్డీ రేటుకే నిధులు: ఎస్బిఐ

Author Icon By Vanipushpa
Updated: March 8, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మహిళాలకు పెద్ద గిఫ్ట్ అందించింది. ఏంటంటే ఇప్పడు మహిళలకు ఎస్బిఐ తక్కువ వడ్డీ రేట్లతో అన్‌సెక్యూర్డ్ లోన్స్ అందించనుంది. దీనిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా SBI ‘ఆస్మిత’ పేరుతో ప్రవేశపెట్టింది. మహిళలకు తక్కువ వడ్డీ రేటుకే నిధులు అందించడమే దీని ముఖ్య ఉదేశ్యం. బ్యాంకు చైర్మన్ ఏం ఏమన్నారంటే: మహిళలు నడిపించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు త్వరగా, సులభంగా క్రెడిట్ యాక్సెస్ పొందడానికి ఈ కొత్త ఆఫర్ సహాయపడుతుందని SBI చైర్మన్ C S శెట్టి అన్నారు. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ టోన్సే ఈ కొత్త ఆఫర్‌ టెక్నాలాజికల్ ఇన్నోవేషన్ అండ్ సామాజిక సమానత్వానికి చిహ్నం అని అభివర్ణించారు. ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా ఎస్బిఐ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత ‘నారి శక్తి’ ప్లాటినం డెబిట్ కార్డును కూడా ప్రవేశపెట్టింది.


బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ ఉమెన్ సేవింగ్స్ అకౌంట్
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా నిన్న శుక్రవారం భారతీయ సంతతికి చెందిన మహిళల కోసం ‘BOB గ్లోబల్ ఉమెన్ NRE & NRO సేవింగ్స్ అకౌంట్’ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా కస్టమర్లకు లాకర్ రెంట్ పై డిస్కౌంట్’తో పాటు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ, హోమ్ లోన్ ఇంకా తక్కువ ప్రాసెసింగ్ ఛార్జ్’తో ఆటో లోన్ వంటి సౌకర్యాలు అందిస్తుంది.

ఉచిత సేఫ్ డిపాజిట్ లాకర్లు

“BOB గ్లోబల్ ఉమెన్ NRE అండ్ NRO సేవింగ్స్ అకౌంట్ నేటి ప్రపంచ భారతీయ మహిళల మారుతున్న డైనమిక్స్ గుర్తిస్తుంది. దీని ద్వారా మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ అధికారాలు, ఆలోచనాత్మకంగా రూపొందించిన ఫీచర్స్ అందించడం ద్వారా వారిని శక్తివంతం చేయడానికి రూపొందించబడింది” అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బినా వహీద్ అన్నారు. కొత్తగా రూపొందించిన BOB ప్రీమియం NRE అండ్ NRO సేవింగ్స్ అకౌంట్ చాలా ఫీచర్లతో వస్తుంది, వీటిలో మంచి ట్రాన్సక్షన్స్ లిమిట్’తో కస్టమైజ్ డెబిట్ కార్డ్, ఉచిత దేశీయ ఇంకా అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్, ఉచిత సేఫ్ డిపాజిట్ లాకర్లు, ఉచిత వ్యక్తిగత ఇంకా విమాన ప్రమాద బీమా కవరేజ్ ఉన్నాయని బ్యాంక్ తెలిపింది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Funds for women Google News in Telugu Latest News in Telugu low interest rates Paper Telugu News sbi banks Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.