हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

మొదటి పెళ్లి రద్దుకాకున్నా.. రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు

Vanipushpa
మొదటి పెళ్లి రద్దుకాకున్నా.. రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు

ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎన్‌.ఉషారాణి Vs మూడుదుల శ్రీనివాస్‌ కేసులో జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మల ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. ఉషారాణి అనే మహిళకు 1999లో నోముల శ్రీనివాస్‌ అనే వ్యక్తితో మొదట వివాహం జరిగింది. అనంతరం విబేధాలతో ఈ జంట 2005లో విడిపోయింది. పరస్పర అంగీకారంతో వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత 2006లో ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు. మూడుదుల శ్రీనివాస్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. 2008లో వారికి ఓ బిడ్డ పుట్టింది. కొన్నాళ్లు సాఫీగా సాగిన కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో . శ్రీనివాస్, అతడి కుటుంబసభ్యులపై గృహహింస కేసు పెట్టింది. తన బిడ్డతో కలిసి రెండో భర్త ఇంటి నుంచి వచ్చేసిన ఆమె.. విడాకులు కోరింది. 2012లో మెయింటెనెన్స్‌ కోసం హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఉషారాణి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు ఆమె నెలకు రూ.3,500, బిడ్డకు రూ.5,000 భరణం చెల్లించాలని మూడుదుల శ్రీనివాస్‌ను ఆదేశించింది. అయితే, ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన అతడు.. మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దుకానందున ఆమెకు తాను భరణం చెల్లించాల్సిన అవసరంలేదని వాదించారు. అతడి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. బిడ్డకు మాత్రమే భరణాన్ని ఖరారు చేసింది. ఆమెకు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ ఉషారాణి సుప్రీంకోర్టు గడపతొక్కారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. అన్ని విషయాలను పరిశీలించి కుటుంబకోర్టు తీర్పును సమర్థించింది. ఆమె గురించి ముందే తెలిసిన ప్రతివాది.. పెళ్లి చేసుకొని విశేషాధికారాలు పొందాడు. బాధ్యతలకు వచ్చేసరికి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. రద్దైన రెండు వివాహాల నుంచి ఆమె మెయింటెనెన్స్‌ కోరి ఉంటే తప్పించుకోడానికి అవకాశం ఉండేది.. పోషణ ఆమెకు కల్పించే లబ్ధి కాదు.. చట్టబద్ధ నైతికహక్కు. ఫ్యామిలీ కోర్టు 2012లో ఆమెకు ప్రకటించిన మెయింటెనెన్స్‌ను పునరుద్ధరిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870