📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Emergency Meeting: కార్యదర్శులతో మోదీఅత్యవసర సమావేశం

Author Icon By Anusha
Updated: May 9, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.దీనికి ప్రతీకారంగా భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌,సరిహద్దుల్లో దాయాది దుస్సాహసానికి ఒడిగట్టడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అత్యవసరంగా దాదాపు 20 విభాగాలకు చెందిన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సుమారు కీలక విభాగాలకు చెందిన 20 మంది కార్యదర్శులకు ప్రధాని ఈ సందర్భంగా ఆదేశించారు. ముఖ్యంగా అత్యవసర వ్యవస్థల పని తీరుపై, సంసిద్ధత, అత్యవసర ప్రతిస్పందన,(Emergency response)అంతర్గత కమ్యూనికేషన్ ప్రోటోకాల్‌లపై ప్రత్యేక దృష్టితో వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేసే దిశగా చర్యలు చేపట్టాలని మోదీ సూచించారు. అత్యవసర వస్తువుల సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, ఉత్తర్వుల కోసం వేచిచూడకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని, కీలక మౌలిక సదుపాయాల భద్రతను నిర్ధారించాలని ప్రధాని ఆదేశాలు జారీచేశారు.

కార్యదర్శులు

భారత త్రివిధ దళాలు పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై విజయవంతంగా వైమానిక దాడులు నిర్వహించిన మర్నాడే ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం ‘కార్యకలాపాల లోపం లేకుండా కొనసాగేందుకు, సంస్థాగత స్థిరత్వాన్ని నిలుపుకోవడానికి మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల మధ్య పటిష్ట సమన్వయం అవసరం’ అని ప్రధాని మోదీ(PM Modi) స్పష్టం చేశారు.కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు, సైబర్ దాడుల నుంచి రక్షణ కోసం తమ శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షించాలన్న ఆదేశాలు కార్యదర్శులకు ఇచ్చారు.ఈ సమీక్ష సమావేశంలో అణుశక్తి, అంతరిక్ష, ఎలక్ట్రానిక్స్, ఐటీ, వినియోగదారుల వ్యవహారాలు, రవాణా, రోడ్డు, రైలు, నౌకా, విద్యుత్, సరిహద్దు నిర్వహణ వంటి రంగాల కార్యదర్శులు పాల్గొన్నారు.అత్యవసర వస్తువుల ధరలు, అప్రమత్తంగా కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని, అలాగే ఆపరేషన్ సిందూర్‌పై నకిలీ వార్తలను వెంటనే నిరోధించాలని సంబంధిత శాఖలను ఆదేశించారని సమాచారం. ప్రతి కార్యదర్శికి తమ శాఖల పరిధిలో ఉన్న ఏర్పాట్లను వివరించేందుకు కొద్ది నిమిషాల సమయం ఇచ్చారు.

Emergency Meeting

మీటింగ్‌లు

ఉదాహరణకు, మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా నిరంతరంగా సాగేందుకు, వంతెనలు, ఓవర్‌హెడ్ ఎలక్ట్రికల్ వ్యవస్థల భద్రతపై దృష్టి సారించాయి. ముఖ్యంగా పశ్చిమ తీరంలోని ప్రధాన నౌకాశ్రయాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. వాటికి పూర్తిగా యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రస్తుతం పప్పులు, ధాన్యాలు, నూనెలు వంటి వస్తువుల ధరలు అదుపులో ఉండటంతో ప్రభుత్వం కొత్త పరిస్థితులను ఎదుర్కొనగలదనే నమ్మకం వ్యక్తం చేసింది.ప్రధానమంత్రితో సమావేశం అనంతరం, ఉన్నతాధికారులు తక్షణమే తమ కార్యాచరణ ప్రణాళికలపై సుదీర్ఘ మీటింగ్‌లు నిర్వహించారని సమాచారం. ఇది జాతీయ సిద్ధత, అంతర్-మంత్రిత్వ సమన్వయాన్ని సమీక్షించాలన్న భారత్ ప్రభుత్వ ప్రణాళికలో భాగం.

Read Also: Video: పాకిస్తాన్‌పై దాడి చేస్తున్న మొదటి వీడియోను విడుదల చేసిన భారత సైన్యం

#EmergencyResponse #HighLevelMeeting #NationalSecurity #PMModi #SupplyChain Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.