📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

DY Chandrachud: మాజీ సీజే డీవై చంద్రచూడ్ కు సుప్రీం షాక్..

Author Icon By Anusha
Updated: July 6, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ అత్యున్నత న్యాయస్థానానికి సేవలందించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన పదవీ విరమణ చేసినా కూడా ఇప్పటికీ కృష్ణ మీనన్ మార్గ్‌ 5లో ఉన్న టైప్ VIII స్థాయి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయకుండా ఉండటంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై కేంద్రానికి లేఖ రాసిన సుప్రీంకోర్టు, చంద్రచూడ్ ‌తో తక్షణమే కృష్ణ మీనన్ మార్గ్ (Krishna Menon Marg) 5లోని బంగ్లాను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేసింది. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10న పదవీ విరమణ చేసిన సమయంలో టైప్ VIII స్థాయి ప్రభుత్వ బంగళాలో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిటైర్ అయిన ప్రధాన న్యాయమూర్తి ఆ తర్వాత ఆరు నెలల పాటు మాత్రమే అందులో ఉచితంగా ఉండేందుకు అనుమతిస్తారు.

కొత్తగా నియమితులైన న్యాయమూర్తులకు ప్రభుత్వం

అయితే, జస్టిస్ చంద్రచూడ్ ఇప్పటికీ తాను సీజేఐగా ఉన్నప్పుడు వాడిన టైప్ 8 స్థాయి బంగళాలోనే ఉంటున్నారు. దీంతో కొత్తగా నియమితులైన న్యాయమూర్తులకు ప్రభుత్వం అధికార నివాసాల కొరత తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో జులై 1న కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి సుప్రీంకోర్టు (Supreme Court) అధికారులు లేఖ రాశారు. ‘‘2025 మే 31తో ఆయనకు అనుమతించిన గడువు ముగిసింది. ఇకపై ఆయన బంగ్లా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. 2022 నిబంధనల ప్రకారం గడువు మించిపోయినందున వెంటనే ఆస్తిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. జస్టిస్ చంద్రచూడ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ, బంగ్లా వివాదం తెరపైకి రావడం గమనార్హం.

DY Chandrachud: మాజీ సీజే డీవై చంద్రచూడ్ కు సుప్రీం షాక్..

ప్రత్యేక అవసరాలు

దీనిపై చంద్రచూడ్ స్పందిస్తూ, నివాసం మారడంలో జాప్యానికి వ్యక్తిగత పరిస్థితులే కారణమని వెల్లడించారు. ‘ఇప్పటికే నాకు ప్రభుత్వం అద్దెకు ఇల్లు కేటాయించింది. కానీ ఆ బంగ్లా గత రెండేళ్లుగా మూసి ఉంది.దాని మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే వెళ్లిపోతాను. ఈ విషయం న్యాయస్థానం అధికారులకు ముందే తెలియజేశాను’ అని వివరించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేక అవసరాలు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు నెమలిన్ మయోపథీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ ఎయిమ్స్‌ (AIIMS) లో చికిత్స పొందుతున్నారు.ఇది పూర్తిగా నా వ్యక్తిగత బాధ్యత, కానీ మానవతా దృక్పథంలోనూ ఇది అర్థవంతమే. నాకు ఉన్న పరిస్థితులు కూడా ముఖ్యమే. గతంలోనూ కొందరు సీజేఐలు గడువు ముగిసినా బంగ్లాలో ఉన్న సందర్భాలు ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also: Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం..భారీగా ప్రాణనష్టం

#BungalowIssue #CJIControversy #DelhiBungalowRow #DYChandrachud #FormerCJI #GovernmentRules #GovtBungalowDispute #JudicialEthics #JudiciaryNews #JusticeChandrachud #KrishnaMenonMarg #LegalNewsIndia #RetiredJudges #SCNotice #SupremeCourtIndia Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.