Drug Bust : ఢిల్లీ విమానాశ్రయంలో ముగ్గురి అరెస్టు – రూ.60 లక్షల విదేశీ గంజాయి జప్తు

Read Time:  1 min
Drug Bust : ఢిల్లీ విమానాశ్రయంలో ముగ్గురి అరెస్టు – రూ.60 లక్షల విదేశీ గంజాయి జప్తు
FONT SIZE
GET APP

ఢిల్లీ (Drug Bust) : దేశ రాజధాని ఢిల్లీలో విదేశాల నుంచి స్మగ్లింగ్ అవుతున్న గంజాయి ఆగడం లేదు. ఇప్పటికే ఆరు నెలల వ్యవధిలో నాలుగు ముఠాలు హైబ్రీడ్ గంజాయిని విదేశాల నుంచి భారత్కు రవాణా చేస్తూ దొరికిపోగా తాజాగా మరో ముగ్గురు ఇదే తరహాలో పట్టు బడ్డారు. పట్టుబడ్డ ముగ్గురు భారత్కు చెందిన వారుగా తేలింది. ఈ నెల ఏడవ తేదీన రాత్రివేళ బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఇద్దరు యువకులు తమ లగేజ్ బ్యాగ్ లో హైబ్రీడ్ గంజాయిని ప్యాకింగ్ చేసివుంచి తీసుకు వస్తుండగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా దొరికి పోయారు. దీని తరువాత ధాయి ఎయిర్లైన్స్ లో బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన మరో యువకుడు కూడా ఇదే తరహాలో లగేజ్ బ్యాగ్ హైబ్రీడ్ గంజాయి దాచివుంచి తీసుకురాగా పట్టు బడ్డాడు. ముగ్గురి వద్ద పట్టుబడ్డ గంజాయి ఆరు కిలోలుగా నిర్ధారించారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 60 లక్షల (60 lakhs) రూపాయలుగా కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Drug Bust

పట్టుబడ్డ ముగ్గురిపై ఎన్ఎపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. వీరికి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధం ఉందనే కోణంలో విచారిస్తున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/forest-attack-attack-on-forest-officials-case-registered-against-35-people/telangana/528846/

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.