📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

పన్ను తగ్గింపులు కోరవద్దు: నితిన్‌ గడ్కరీ

Author Icon By Vanipushpa
Updated: March 10, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పన్ను తగ్గింపులు కోరవద్దని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కార్ల పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి డబ్బు అవసరమన్నారు. భారత్‌లో లాజిస్టిక్స్‌ ఖర్చు రెండేళ్లలోపు 9శాతానికి తగ్గుతుందన్నారు. జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేయొద్దన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. పన్నులు తగ్గిస్తే.. మరింత డిమాండ్‌ చేస్తారన్నారు. ఇది మానవ మస్తత్వం అన్నారు. తాము పన్నులను తగ్గించాలని అనుకుంటున్నామని.. కానీ పన్నులు లేకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేదన్నారు. ధనవంతుల నుంచి పన్నులు తీసుకొని పేదలకు ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ దార్శనికత అని.. ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు.

దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 14-16 శాతంగా..

ప్రస్తుతం దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 14-16 శాతంగా ఉందని.. రాబోయే రెండేళ్లలోపు లాజిస్టిక్స్ ఖర్చు 9శాతానికి తగ్గుతుందని హామీ ఇచ్చారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత పోటీతత్వాన్ని కలిగి ఉంటామన్నారు. చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8శాతం ఉండగా.. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఇది 12 శాతం ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా భారత పరిశ్రమ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మూలధన పెట్టుబడిని పెంచడం ద్వారా భారతదేశం మరిన్ని ఉద్యోగాలను సృష్టించబోతోందని చెప్పారు. ‘మీరంతా సంపద సృష్టికర్తలు మాత్రమే కాదు.. ఉద్యోగ సృష్టికర్తలు’. ఈ స్వర్ణ యుగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ పిలుపునిచ్చారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Don't ask for tax cuts Google News in Telugu Latest News in Telugu Nitin Gadkari Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.