దేశ రాజధాని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా కానున్నారు. ఈ గురువారం రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారి బిజెపి ఎమ్మెల్యే అయిన రేఖ గుప్తాను బిజెపి పార్టీ అధిష్టానం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా నియమించింది. రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది.
న్యాయవాదిగా కెరీర్ ఆరంభం
రేఖ వృత్తిరీత్యా న్యాయవాది. దీనికి ముందు ఆమె కౌన్సిలర్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రజలు ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన 11 రోజుల తర్వాత, బిజెపి చివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. నేడు బుధవారం సాయంత్రం జరిగిన బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో పరిశీలకులు ఓపి ధంకర్, రవిశంకర్ ప్రసాద్ బిజెపి కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు. అయితే రేఖ గుప్తా ఆస్తిలు ఏంటో తెలుసా..
రేఖ గుప్తా నికర ఆస్తుల విలువ
రేఖ గుప్తా ఆస్తులు మొత్తం ఆస్తులు: రూ.5.31 కోట్లు రేఖ గుప్తాపై లోన్లు ఇంకా ఇతర అప్పులు: రూ.1.20 కోట్లు రేఖ గుప్తా వార్షిక ఆదాయం 2023-24: రూ.6.92 లక్షలు 2022-23: రూ.4.87 లక్షలు 2021-22: రూ.6.51 లక్షలు 2020-21: రూ.6.07 లక్షలు 2019-20: రూ.5.89 లక్షలు రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం 2023-24: రూ.97.33 లక్షలు 2022-23: రూ.64.56 లక్షలు 2021-22: రూ.23.13 లక్షలు రేఖ గుప్తాకి మారుతి XL6 (2020 మోడల్) కారు ఉంది, దీని విలువ దాదాపు రూ.4.33 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. రేఖ గుప్తా ఆస్తులకి సంబంధించిన ఈ వివరాలు ఆమె అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ సమయంలో ఇచ్చిన అఫిడవిట్ నుండి తీసుకోబడ్డాయి.