ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో తుదిపోరుకు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు,అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు,ఈ క్రమంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆర్సీబీ(RCB)కి బలమైన మద్దతును ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్(Final match)కు ముందు ఆయన ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేసి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
పోరాటం
ఆర్‌సీబీకి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈసారి కప్ బెంగళూరుదేనని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. 18 ఏళ్ల పోరాటంలో ప్రతి ప్రార్థన, ఎంకరేజ్‌మెంట్, బాధ ఈ రోజు కోసమే అంటూ ఆయన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.”ఈసారి కప్ మనదే! 18 సంవత్సరాల పోరాటం. ప్రతి ప్రార్థన, ప్రతి ఉత్సాహం, ప్రతి హృదయ విదారకం ఇవన్నీ ఈ రోజు కోసమే. ఇది ఒక మ్యాచ్ కంటే ఎక్కువ. మన క్షణం. మన కప్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆర్‌సీబీ. కర్ణాటక ప్రజలంతా మీతోనే ఉన్నారు” అని ఓ వీడియో రిలీజ్ చేశారు.ప్రస్తుతం డిప్యూటీ సీఎం(Karnataka Deputy CM DK Shivakumar) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆర్‌సీబీ ఫ్యాన్స్ తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఈసారి తప్పకుండా ఐపీఎల్ ట్రోఫీ ఆర్‌సీబీదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆత్రుతగా
మరికొన్ని గంటల్లో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. తుది సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) వేదిక కానుంది. తుది పోరులో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అమీతుమీ తేల్చుకోనున్నాయి.