📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Uttara Pradesh: చెట్టు కింద నిద్రిస్తుండగా చెత్త డంప్‌ వేయడంతో వ్యక్తి మృతి

Author Icon By Anusha
Updated: May 24, 2025 • 2:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూపిలోని బరేలీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తి అలసిపోయి తన ఇంటికి సమీపంలోని ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు.అలాగే, అతడు అక్కడే నిద్రలోకి జారుకున్నాడు. సునిల్‌ కుమార్‌(Sunil Kumar) గాఢ నిద్రలో ఉండగా, అక్కడికి వచ్చిన మున్సిపల్ చెత్త వాహన సిబ్బంది ఆయనను గమనించకుండా డ్రైనేజీ సహా చెత్తను ఆయనపైనే కుమ్మరించారు. దాంతో సునిల్‌ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.అనంతరం సునిల్ కుమార్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని బయటకు తీసి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తు అతడు అప్పటికే మరణించాడని వైద్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, సునిల్‌ కుమార్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బారాదరి పోలీసులు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

చెత్త డంప్‌ వేయడంతో వ్యక్తి మృతి

డిమాండ్

కాగా, జరిగిన సంఘటనపై స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Read Also : Jharkhand Encounter: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌ JJMP అధినేత హతం

#BareillyTragedy #CivicFailure #MunicipalityNegligence #TragicIncident #UPNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.