Corruption : సమాజం అవినీతిని అంగీకరిస్తోందా?

Follow Us: Google News Daily Hunt
Corruption
Corruption
FONT SIZE
GET APP

Corruption :అవినీతి అంటే అధికారాన్ని, పదవిని లేదా బాధ్యతను వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేయడం. సాధా రణంగా ఇది చట్టవిరుద్ధం లేదా నైతికంగా తప్పు. ప్రభుత్వాధికారి, ఉద్యోగి లేదా నాయకుడు వంటి నమ్మక స్థానం లో ఉన్న వ్యక్తి ప్రజలకు న్యాయంగా సేవచేయకుండా తనకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించినప్పుడు అవినీతి జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో అవినీతి సాధారణంగా మారుతోంది. ఎందుకంటే ధనిక దేశాలుగానీ, పేదదేశాలలో అవినీతి రూపాల స్థాయి దేశానికొకలా ఉన్నప్పటికీ, దాని మూలకారణాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉన్నాయి. ఉదాహరణకు, రష్యాలో రాజకీయ శక్తి, వ్యాపార ప్రయోజనాల మధ్య ఉన్న సంబంధాలు, మయన్మార్లో సైనిక ఆధిపత్యం, భారత్లో భూమి, నిర్మాణం, అనుమ తుల ప్రక్రియ, నైజీరియాలో సాధారణ సేవల కోసం అన ధికారిక చెల్లింపులు జరుగుతాయి. బంగ్లాదేశ్, కెన్యాలో తక్కువ జీతాలు, ఉద్యోగభద్రత లేకపోవడం, అమెరికా, బ్రెజిల్ లో ఎన్నికల ఖర్చులు ఎక్కువగా ఉండడంవల్ల రాజకీయ నాయకులు పెద్దదాతలపై ఆధారపడుతూ, తర్వాత వారికి అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం మొదలయినవి.

Read Also : Fuel : భారీగా పెరిగిన విమాన ఇంధనం ధరలు..ప్రయాణికులకు షాక్ తప్పదా ?

Corruption
Corruption

Corruption: మౌలిక వసతులు బలహీనపడతా యి

స్విట్జర్లాండ్, పనామా వంటి దేశాల్లో అంతర్జాతీయంగా అక్రమ డబ్బును దాచుకోవడం సులభం. యుద్ధాలు, ప్రకృతివిపత్తులు అత్యవసర ఖర్చులు కూడా పర్యవేక్షణను బల హీనపరుస్తాయి. ఉదాహరణకు, ఉక్రెయిన్ యుద్ధ సమ యంలో అత్యవసర కొనుగోళ్లలో అవినీతి అనుమానాలు ఉన్నాయి. హైతీలో విపత్తు సహాయ నిధుల దుర్వినియోగం జరిగింది. ఈఅన్ని అంశాలు కలిసి అవినీతిని ప్రపంచ వ్యాప్త సమస్యగా మారుస్తున్నాయి. ప్రపంచబ్యాంక్ ప్రకారం, అవినీతి వ్యాపారాలపై అదనపు పన్నులా పనిచేస్తుంది. దీని వల్ల సామర్థ్యం, ఆవిష్కరణ తగ్గుతాయి. ఇది ప్రజావనరుల కోసం కేటాయించిన నిధులు వ్యక్తిగత లాభాలకోసం మళ్లించబడతాయి. ఫలితంగా మౌలిక వసతులు బలహీనపడతా యి. పేదరికం, అసమానతలను కూడా పెంచుతుంది. ద్రవ్యోల్బణం, నల్లధన ఆర్థికవ్యవస్థ (Economy)ను ప్రోత్స హిస్తుంది. చివరికి, ఇది ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్నిదెబ్బతీసి, ప్రజాస్వామ్య స్థిరత్వానికి ముప్పుకలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అవినీతిని పర్యవేక్షించడానికి, మంచిపాలనను ప్రోత్సహించడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ అంతర్జా తీయ సంస్థలు అవినీతి కొలిచే, బాధ్యతాయుత పాలనను ప్రోత్సహించే సంస్కరణలను ప్రేరేపించే కీలకపాత్ర పోషిస్తున్నాయి.

రాజకీయ అస్థిరత

ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రచురించిన కరప్ష న్ఫర్సెప్షన్స్ ఇండెక్స్ ప్రకారం, డెన్మార్క్, ఫిన్లాండ్, సింగ పూర్, న్యూజిలాండ్, నార్వే వంటి దేశాలు పారదర్శకత, బలమైనసంస్థలు, కఠినమైన చట్టం అమలు వల్ల అత్యల్ప అవినీతి దేశాలుగా నిలుస్తాయి. వీటిలో ప్రజాబాధ్యతా యుతం, చట్టపరిపాలనకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మరోవైపు,దక్షిణసూడాన్, సోమాలియా, వెనిజులా, సిరి యా, యెమెన్ వంటిదేశాలు రాజకీయ అస్థిరత, బలహీన పాలన దీర్ఘకాలిక ఘర్షణల కారణంగా అత్యధిక అవినీతిని ఎదురొకంటున్నాయి. భారతదేశంలో అవినీతి ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 2025 అవినీతి అవగాహన సూచిక ప్రకారం, 182దేశాలలో భారతదేశం 91వ స్థానంలోఉంది. భారతదేశంలో ఉన్నతస్థాయి అధికారుల్లో అవినీతి పలు నిర్మాణాత్మక సంస్థాగత కారణాల వల్ల ఏర్పడుతుంది. ముఖ్యంగా రాజకీయ ఒత్తిడి ఒక ప్రధానకారణం. ఇందులో రాజకీయ నాయకులు కొన్ని వ్యక్తులు, కాంట్రాక్టర్లు లేదా వ్యాపారాలకు అనుకూలంగా పనిచేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తారు. ముఖ్యంగా బదిలీలు, పోస్టింగుల విషయంలో. భూసంబంధ పరిపాలన, పోలీసింగ్, లైసెన్సిగ్ కొను గోలు వంటిరంగాల్లో ఉన్నవిస్తృత స్వేచ్ఛా అధికారాలు పర్య వేక్షణ బలహీనంగా ఉన్నప్పుడు దుర్వినియోగానికి దారితీస్తా యి. క్రమశిక్షణా చర్యల్లో ఆలస్యం, క్లిష్టమైన అనుమతి ప్రక్రి యలు శిక్ష భయాన్ని తగ్గించి అవినీతిని నిరోధించే శక్తిని బలహీనపరుస్తాయి. గనులు, మౌలికవసతులు, రియల్ఎస్టేట్ రంగాల్లో రాజకీయ నాయకులు, వ్యాపారులు అధి కారుల మధ్య ఉన్న సంబంధాలు అక్రమ లాభాల కోసం ప్రవర్తనకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో ఉన్నత జీవన శైలి నిర్వహించాలనే సామాజిక ఒత్తిడులు కూడా అనైతిక నిర్ణయాలకు దారితీస్తాయి. అత్యున్నత స్థాయి అధికారులతో సంబంధం ఉన్న పలు అవినీతి కేసులు భారతదేశంలో పరిపాలనాబాధ్యతపై ఉన్న సవాళ్లను బయటపెట్టాయి.

ఆర్థిక నష్టాలకు కారణం

అవి నీతి కొనసాగడానికి ఒక ముఖ్యకారణం శిక్షలు తక్కువగా ఉండడం లేదా ఆలస్యంగా అమలవడం, శిక్షల నిర్ధారణ తకుక్కువగా ఉండటంవల్ల చాలా కేసుల్లో నేరస్తుల విచారణలు, కోర్టు ప్రక్రియలు సంవత్సరాల పాటు కొనసాగుతాయి. దీర్ఘ కాలిక విశ్లేషణ ప్రకారం, ప్రపంచంలో నమోదుచేసిన అవినీతి కేసుల్లో కేవలం సుమారు 19మాత్రమే శిక్షకు దారితీస్తు న్నవి. అంటే, అన్నినమోదైన కేసులను పరిగణనలోకి తీసు కుంటే, దాదాపు ప్రతి 5 కేసుల్లో 1 కేసు మాత్రమే శిక్షతో ముగుస్తుంది. భారతదేశంలో ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 65-75 శాతం వరకు శిక్ష విధింపు రేటు ఉంది. ఉదాహరణకు 2022లో 74.59శాతం, 2023 – 71.47శాతం, 2024లో – సుమారు 69 శాతం తీర్పు వచ్చే సమయానికి చాలామంది అధికారులు పదవీ విరమణ పొందుతారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్విజిలెన్స్ కమిషన్ వంటి సంస్థల బలహీన అమలు కూడా సమస్యను పెంచుతుంది. రాజకీయ-బ్యూరోక్రాటిక్ సంబం ధాలు అవినీతి అధికారులకు రక్షణ కల్పిస్తాయి. పబ్లిక్సర్వెంట్స్ పై కేసులు నమోదు చేయడానికి ముందస్తు అనుమతి అవసరం వంటి క్లిష్టచట్టపరమైన ప్రక్రియలు కూడాఆలస్యం కలిగిస్తాయి. అనేక సందర్భాల్లో అక్రమ ఆస్తులు పూర్తిగా స్వాధీనం చేయకపోవడంవల్ల నేరస్తులు లాభాలను కొనసా గిస్తారు. కఠినంగా వ్యవహరించే అధికారులకు తగిన రక్షణ లేకపోవడం చట్టాల అసమాన అమలు బాధ్యతను బలహీన పరుస్తుంది. అవినీతి భారతదేశంలో గణనీయమైన ఆర్థిక (Economy)నష్టాలకు కారణమైంది. దేశస్థూల దేశీయోత్పత్తిలో సుమారు 16.6 వరకు ప్రభావం చూపవచ్చు.

Corruption
Corruption

సంస్కరణలు అవసరం

భారత ఆర్థిక వ్యవస్థసుమారు 4ట్రిలియన్ డాలర్లకు చేరువవుతున్న నేపథ్యంలో, దీనివల్ల దీర్ఘకాలంలో దాదాపు 56-57లక్షల కోట్లు నష్టంగా భావించవచ్చు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ నివేదిక ప్రకా రం, 1948 నుండి 2008 మధ్యకాలంలో అవినీతి, పన్ను ఎగవేత, అక్రమ చర్యల వల్ల భారతదేశం సుమారు 462 బిలియన్ డాలర్లను కోల్పోయింది. భారతదేశంలో అవినీతిని నియంత్రించడానికి బలమైన చట్టపరమైన, సంస్థాగత, పరి పాలనా సంస్కరణలు అవసరం. వేగవంతమైన, ఖచ్చితమై న శిక్షలను నిర్ధారించడానికి ప్రత్యేక అవినీతినిరోధక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. తద్వారా విచారణలు త్వరగా పూర్తవుతాయి. ప్రభుత్వఉద్యోగులపై కేసులు నమో దు చేయడానికి ముందస్తు అనుమతి అవసరాన్ని పరిమితం చేయడం లేదాతొలగించడం ద్వారా ఆలస్యాలను తగ్గించాలి. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కఠినంగా స్వాధీనం చేసుకోవడం ద్వారా అవినీతి అధికారుల అక్రమ సంపదను పూర్తిగా కోల్పోయేలా చేయాలి. లోక్పాల్, సెంట్రల్ విజి లెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి స్వతంత్ర సంస్థలను బలపరచి, రాజకీయ జోక్యంనుంచి రక్షించాలి. పారదర్శకమైన, నియమాల ఆధారిత బదిలీ, పోస్టింగ్ వ్యవస్థలు రాజకీయఒత్తిడిని తగ్గిస్తాయి. ఈగవర్నెన్స్, డిజిటల్ రికార్డులు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్వ్యవస్థ లను విస్తరించడంద్వారా మానవ జోక్యాన్ని తగ్గించి లంచాలకు అవకాశాలను తగ్గించవచ్చు. రాజకీయ నిధులు సంస్కర ణలు అవసరం. ఉద్యోగసంఘాలు కూడా అవినీతిని నియం త్రించడంలో, నైతిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం చట్ట బద్ద విచారణలకు సహకరించడం ద్వారా విశ్వసనీయతను ప్రజల నమ్మకాన్ని బలపరుస్తాయి.


-డాక్టర్. పి.ఎస్. చారి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు