📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Corona : పెరుగుతున్న కరోనా ..6000 మార్కును దాటిన కేసుల సంఖ్య

Author Icon By Sudha
Updated: June 9, 2025 • 4:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో మరోసారి అడుగుపెట్టిన కరోనా రక్కసి (Corona Rakkasi)అంతకంతకూ విజృంభిస్తోంది (Booming). పదులు, వందలుగా ఉన్న కేసులు… ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం చూస్తుంటే మళ్లీ పాతరోజులొస్తాయా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల్లోనే మొత్తం యాక్టివ్‌ కేసుల(Active cases) సంఖ్య 6 వేలు క్రాస్‌ అయింది.. భారతదేశంలో ఆదివారం నాటికి యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది.

Corona : పెరుగుతున్న కరోనా ..6000 మార్కును దాటిన కేసుల సంఖ్య

ప్రస్తుతం దేశంలో 6491 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు నమోదుకాలేదు.. ఆదివారం మాత్రం ఆరు మరణాలు నమోదయ్యాయి.
రోజు రోజుకు పెరుగుతున్న కేసులు
కేరళలో 144 కొత్త కేసులు నమోదయ్యాయి.. గుజరాత్, పశ్చిమ బెంగాల్ వరుసగా 105, 71 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జనవరి 1, 2025 నుండి దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 కారణంగా మొత్తం 65 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 753 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. కేరళ, ఢిల్లీ, గుజరాత్‌, బెంగాల్‌, కర్నాటకలో కొవిడ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 6861 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఇచ్చిన గణాంకాల ప్రకారం.. కేరళ 1957, గుజరాత్‌లో మొత్తం 980, ఢిల్లీ 728, ఆంధ్రప్రదేశ్ 85, తెలంగాణ 9 లో కరోనా కేసులు ఉన్నాయి.
అహ్మదాబాద్‌లో బాలిక మృతి..
ఇదిలాఉంటే.. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో 16 ఏళ్ల బాలిక కరోనాతో మరణించింది. రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ ఇచ్చిన తర్వాత కూడా ప్రాణాలు దక్కలేదు.. ఆ బాలిక జూన్ 4 నుండి సోలా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కరోనాతో చాలా కాలంగా చికిత్స పొందుతున్న ఆ బాలిక మరణించడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
పిల్లలు మరింత జాగ్రత్త
దేశంలోని చాలా కోవిడ్ కేసులు JN.1, NB.1.8.1, LF.7 వంటి ఒమిక్రాన్ ఉపరకాలతో ముడిపడి ఉన్నాయి. ఈ వైరస్ లు త్వరగా వ్యాప్తి చెందుతాయి.. కానీ అవి అంత ప్రమాదకరమైనవి కావు. వాటి లక్షణాలు కూడా తేలికపాటివి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న రోగులు, వృద్ధులు, చిన్న పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి.

Read Also:Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో మరో సంచలనం

Breaking News in Telugu Corona cases on the rise crosses 6000 mark Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.