📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Kamal: కమల్ వ్యాఖ్యలతో కర్ణాటకలో తీవ్ర వివాదానికి కారణాలు ఏమిటి?

Author Icon By Vanipushpa
Updated: June 4, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్(Kamal hasan) చేసిన వ్యాఖ్య కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, ఏ భాష…ఏ భాష నుంచి వచ్చిందో చెప్పడం కష్టమని భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కమల్ హాసన్ హీరోగా రూపొందిన ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో విడుదల చెన్నై(Chennia)లో జరిగింది. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. “రాజ్‌కుమార్ కుటుంబం నా కుటుంబం లాంటిది. అందుకే ఆయన ఇక్కడికి వచ్చారు. అందుకే నా ప్రసంగం ప్రారంభించినప్పుడు, ‘ఉయిరే ఉరవే తమిళే’ అని ప్రారంభించాను. కన్నడ తమిళం(Kanadam, Tamilam) నుంచి పుట్టింది. మీరు కూడా దానితో ఏకీభవిస్తారు” అని శివరాజ్‌కుమార్ గురించి మాట్లాడుతూ కమల్ హాసన్ అన్నారు. కమల్ మాటలకు శివరాజ్‌కుమార్ చిన్నగా నవ్వారు.
అయితే, కన్నడ భాష పుట్టుకపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో తీవ్ర అలజడి సృష్టించింది. కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి కన్నడ సంస్థల వరకు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయినా, తన మాటలు వెనక్కి తీసుకోబోనని కమల్ అన్నారు.

Kamal: కమల్ వ్యాఖ్యలతో కర్ణాటకలో తీవ్ర వివాదానికి కారణాలు ఏమిటి?


వివాదంతో థగ్ లైఫ్’ విడుదల కావడం లేదు

ఈ వివాదం వల్ల ‘థగ్ లైఫ్’ జూన్ 5న కర్ణాటకలో విడుదల కావడం లేదు.
ద్రావిడ భాషలు తమిళం నుంచి పుట్టుకొచ్చాయన్న వాదన కొత్తది కాదు. చాలా కాలం నుంచి తమిళ జాతీయవాదులు ఈ ఆలోచనను ముందుకు తెస్తున్నారు. అయితే, ద్రావిడ భాషా కుటుంబంలోని ఇతర భాషలవాళ్లు దీనిని ఒప్పుకోవడం లేదు.
ద్రావిడ భాషలకు తమిళం మాతృభాషా లేక సోదర భాషా?
ద్రావిడ భాషల సమగ్ర తులనాత్మక అధ్యయనాన్ని చేపట్టిన మొదటి వ్యక్తి 19వ శతాబ్దపు భాషావేత్త రాబర్ట్ కాల్డ్‌వెల్. ఆయన రాసిన ‘ఎ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ది ద్రవిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్’ అనే పుస్తకం ద్రావిడ భాషా కుటుంబలోని భాషలను క్రమపద్ధతిలో పోల్చి కొన్నివిషయాలు తెలియజేసింది. “తమిళంతో సహా ద్రావిడ భాషలు ఇండో-ఆర్యన్ భాషల నుంచి ఉద్భవించలేదు. అవి ద్రావిడ అనే ప్రత్యేక భాషా కుటుంబానికి చెందినవి” అని కాల్డ్‌వెల్ ప్రతిపాదించారు. ద్రావిడ భాషలు ప్రోటో-ద్రవిడియన్ అనే భాష నుంచి పుట్టాయని, తమిళానికి ఈ ప్రోటో-ద్రవిడియన్ భాషతో మరింత దగ్గరి సంబంధం ఉందని కాల్డ్‌వెల్ గుర్తించారు.
‘తమిళంతో కన్నడకు దగ్గరి పోలిక’
ఆయన పుస్తకంలో “తమిళం, కన్నడ వేర్వేరు భాషలుగా రూపొందే ప్రక్రియలో చివరి దశలో ఉన్నాయి’ అనే పదబంధం మాత్రమే కన్నడ తమిళం నుంచి ఉద్భవించిందన్న భావనను సూచిస్తుంది. తమిళం కాకుండా, తెలుగు, మలయాళం, కన్నడ వంటి ఇతర ముఖ్యమైన ద్రావిడ భాషల తొలినాటి సాహిత్యాలు వేరే భాషలోని సాహిత్యానికి కాపీలు లేదా వాటి నమూనాలో రూపొందాయని ఆయన అన్నారు.
ద్రావిడ భాషల మూలం ఏదంటే…
“కంపారిజన్ ఆఫ్ ది ద్రవిడియన్ లాంగ్వేజెస్” అనే పుస్తకాన్ని రాసిన రాబర్ట్ కాల్డ్‌వెల్ ఇతర భాషలు తమిళం నుంచి ఉద్భవించాయని వాదించలేదు. దానికి బదులుగా ఆయన ప్రోటో-ద్రవిడియన్ భాష అనే భావనను ప్రతిపాదించారు. ఆ ప్రోటో-ద్రవిడియన్ భాషకు తమిళం దగ్గరగా ఉన్న భాష అని ఆయన అన్నారు. “అన్ని ద్రావిడ భాషలను సోదర భాషలుగా ఆయన అభివర్ణించారు. ఆయన తర్వాత వచ్చిన భాషా శాస్త్రవేత్తలు ఈ ప్రోటో-ద్రవిడ భాషలను ఉత్తర ప్రోటో-ద్రవిడ, దక్షిణ ప్రోటో-ద్రవిడతో సహా అనేక రకాలుగా విభజించారు” అని ఎం.డి. ముత్తుకుమారసామి వివరించారు. “ఒక ద్రావిడ మూల నిఘంటువు సంకలనం చేశారు. ఈ మూల నిఘంటువులోని చాలా పదాలు తమిళంలో ఉన్నాయి.
‘ఏదీ తల్లి భాష కాదు’
తమిళం నుంచి ఇతర ద్రావిడ భాషలు ఉద్భవించాయని చెప్పడం సరైనది కాదని రచయిత, ప్రొఫెసర్ పెరుమాళ్ మురుగన్ అన్నారు. “మిగతా భాషలన్నీ అసలు ద్రావిడ భాష నుంచి శాఖలుగా విడిపోయి ఉండొచ్చనే భాషావేత్త అభిప్రాయాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. అసలు ద్రావిడ భాష ఎక్కడ అని వారు అడుగుతారు. మీరు ఒక రాయిని పగలగొడితే, అది అనేక ముక్కలుగా విరిగిపోతుంది. అసలు రాయి ఎక్కడ అని మీరు అడగలేరు” అని దీనిపై రాసిన ఓ వ్యాసంలో పెరుమాళ్ మురుగన్ అభిప్రాయపడ్డారు.
‘కన్నడ, తమిళం రెండింటి మూలం అదే’
తమిళనాడులోని చాలా మంది భాషావేత్తలు ఈ వివాదం నుంచి దూరంగా ఉన్నారు. ఊహించినట్టుగానే, కన్నడ భాషావేత్తలు ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
“కన్నడం తమిళం నుంచి ఉద్భవించిందనేది పూర్తిగా అపోహ. తమిళం, కన్నడ సోదర భాషలు. పాత భాష నుంచి ఉద్భవించిన భాషలు. కన్నడ మూల-ద్రావిడ భాష నుండి ఉద్భవించింది..తమిళం నుంచి కాదు” అని పెరుమాల్ మురుగన్ చెప్పారు.

Read Also: Rishi Sunak: కన్నడలో నా భార్యకి ప్రపోజ్ చేశాను:

#telugu News Ap News in Telugu Breaking News in Telugu for the intense controversy Google News in Telugu in Karnataka Latest News in Telugu over Kamal's comments? Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today what are the reasons?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.