SHAHSHI THAROOR: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్​ తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు

Read Time:  1 min
SHAHSHI THAROOR: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్​ తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు
FONT SIZE
GET APP

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్​ (Shashi Tharoor)పై పార్టీ అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ అధినాయకత్వంతో బంధం బీటలు వారుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న ఈ క్రమంలో- సొంత పార్టీలోనే ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇటీవల భారత్‌- పాకిస్థాన్‌ (Barat and pakistan)ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యానాలు చేశారు శశిథరూర్‌. దీంతో ఆయన లక్ష్మణ రేఖ (Lakshmana Rekha)దాటారని పార్టీ వర్గాలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

SHAHSHI THAROOR:  కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్​ తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు
SHAHSHI THAROOR: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్​ తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు

లక్ష్మణ రేఖ దాటారు
రాహుల్‌ గాంధీ, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, శశిథరూర్‌, ప్రియాంక గాంధీ, సచిన్‌ పైలట్‌ సహా మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు బుధవారం దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం పార్టీ వర్గాలు శశిథరూర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాయి. కాంగ్రెస్ ఓ ప్రజాస్వామ్య పార్టీ అని, ఇందులో నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారని వెల్లడించాయి. అయికే, శశిథరూర్‌ మాత్రం ఈసారి లక్ష్మణ రేఖ దాటారని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వ్యక్తిగత అభిప్రాయాల వెల్లడికి ఇది సమయం కాదని, పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని తాజా సమావేశంలో అధిష్ఠానం సైతం ఎవరి పేరు ఎత్తకుండానే స్పష్టం చేసిందని అని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై జైరాం రమేశ్‌ సైతం స్పందించారు. శశిథరూర్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలన్నారు. వాటికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాగా, శశి థరూర్​ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు.
ప్రధాని సమర్ధవంతంగా వ్యవహరించారు
ఇదిలా ఉండగా, భారత్‌- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమర్థంగా వ్యవహరించారంటూ ఇటీవల శశిథరూర్​ కొనియాడారు. ఉగ్రవాదం విషయంలో దాయాది దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని ప్రసంశించారు.
ఇటీవల కేరళలో రూ. 8,867 కోట్లతో నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని ప్రారంభించారు. ఈ క్రమంలోనే మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ ఫొటో చాలామందికి నిద్రలేకుండా చేస్తుందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి శశిథరూర్‌, విజయన్‌ ముందే ప్రధాని వ్యాఖ్యానించారు. “ఈ రోజు శశి థరూర్‌ ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమం కొందమందికి నిద్రలేని రాత్రిని మిగులుస్తుంది. మసేజ్​ ఎక్కడి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది” అని మోదీ చురుకు అంటించారు.

Read Also : E-Passport : దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్ట్ లాంచ్‌…

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.