పహల్గామ్ దాడికి బాధ్యులైన నలుగురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి. ఆపరేషన్ మహాదేవ్ (Operation Mahadev) పేరుతో జరిగిన ఈ రహస్య ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైంది. ఈసారి ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాన్ని గుర్తించడంలో చైనీస్ శాటిలైట్ ఫోన్ (Chinese satellite phone) సిగ్నల్ కీలక పాత్ర పోషించింది.నిషేధిత T-82 అల్ట్రాసెట్ శాటిలైట్ ఫోన్ అనుకోకుండా యాక్టివేట్ కావడంతో వారి ఆచూకీ బయటపడింది. ఈ ఫోన్ చైనాకు చెందిన హువావే నెట్‌వర్క్ పై పనిచేస్తుంది. గత వారం చివర్లో ఫోన్ యాక్టివేట్ కావడంతో ఢిల్లీలోని యూనిట్లు సిగ్నల్‌ను గుర్తించాయి. దీంతో భారత బలగాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి.

ఆపరేషన్ మహాదేవ్ ఎలా సాగింది?
సోమవారం అర్థరాత్రి ఉగ్రవాదులు రహస్య కమ్యూనికేషన్ ఆన్ చేశారు. ఉదయం 8 గంటలకు బలగాలు డ్రోన్‌లతో డచిగం అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. 9:30కు హిల్ ప్రాంతం చుట్టుముట్టారు. 11:15కు ఒక ఉగ్రవాదిని హతమార్చారు. కొద్ది సేపటికే మరో ముగ్గుర్ని మట్టుబెట్టారు. మొత్తం ఆపరేషన్ 90 నిమిషాల్లో పూర్తి అయింది.
హషీమ్ మూసా మరణం
హతమైన వారిలో పహల్గామ్ దాడి మాస్టర్‌మైండ్ హషీమ్ మూసా కూడా ఉన్నాడు. ఏప్రిల్ 22 దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రపంచం ఖండించిన సంగతి తెలిసిందే.భారతదేశం ఈ శాటిలైట్ ఫోన్‌లను 15 ఏళ్ల క్రితమే నిషేధించింది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత హువావే, ZTE ఉత్పత్తులపై పూర్తి నిషేధం విధించింది. ఈ ఫోన్‌లు చైనాకు చెందిన టియాంటాంగ్-1 శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తాయి.
ఉగ్రవాదుల రెక్కీకి అదే ఉపయోగం
పెహల్గామ్ దాడికి ముందు రెక్కీ కోసం కూడా ఈ ఫోన్‌లనే ఉపయోగించారు. బైసరన్ లోయలో మూడు శాటిలైట్ ఫోన్ సిగ్నల్‌లు గుర్తించబడ్డాయి. ఈ సిగ్నల్‌లతోనే ఉగ్రవాదుల చివరి కదలికలు బయటపడ్డాయి.భారత బలగాలు శత్రువులను వేటాడటమే కాకుండా, వారి టెక్నాలజీని వారికే ఉచ్చుగా మార్చాయి. ఈ ఆపరేషన్‌లో టెక్నాలజీ వినియోగం అత్యుత్తమంగా జరిగిందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. దేశ భద్రత కోసం ఇది మరో విజయ గాధగా నిలిచింది.
Read Also : Narendra Modi : ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేత మాకు చెప్పలేదు : మోదీ