Leopard dies : కోతిని వేటాడేందుకు వెళ్లి.. విద్యుదాఘాతానికి బలైన చిరుత

Follow Us: Google News Daily Hunt
Leopard dies
Leopard dies
FONT SIZE
GET APP

Leopard dies : మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆహారం కోసం కోతిని వేటాడిన ఐదేళ్ల ఆడ చిరుత ప్రమాదవశాత్తూ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కడంతో కరెంట్ షాక్‌కు గురై మృతి చెందింది. గ్రామ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చిమూరు తాలూకా శంకరాపూర్ గ్రామ సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆహారం కోసం వెతుకుతున్న చిరుతకు ఒక కోతి కనిపించడంతో దానిని వేటాడేందుకు ప్రయత్నించింది. చిరుత నుంచి తప్పించుకునేందుకు కోతి సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభంపైకి ఎక్కింది. కోతిని పట్టుకునేందుకు చిరుత కూడా ట్రాన్స్‌ఫార్మర్ స్తంభంపైకి ఎక్కింది. అయితే అక్కడ ఉన్న విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌కు దాని శరీరం తగలడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురైంది.

Read Also: Pulses Price Hike: పండగ వేళ పప్పుల ధరల షాక్.. నెల రోజుల్లోనే 11 శాతం పెరుగుదల

 Leopard dies
Leopard dies

Leopard dies : స్తంభంపైనే మృతి

తీవ్రమైన విద్యుత్ షాక్ కారణంగా చిరుత స్తంభంపైనే మృతి చెందినట్లు అటవీ అధికారులు తెలిపారు. అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌పై చిరుత కళేబరాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చిమూరు అటవీ క్షేత్ర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు జాగ్రత్తగా చిరుత కళేబరాన్ని స్తంభం నుంచి కిందకు దించారు. అనంతరం దానిని అటవీ కార్యాలయానికి తరలించారు. అటవీ శాఖ అధికారులు వెటర్నరీ వైద్యుల సమక్షంలో చిరుత మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణ అనంతరం అటవీ శాఖ నిబంధనల ప్రకారం కళేబరాన్ని ఖననం చేసినట్లు సమాచారం. చంద్రపుర్ జిల్లా అటవీ ప్రాంతాలకు సమీపంలో గ్రామాలు, వ్యవసాయ భూములు విస్తరించి ఉండటంతో వన్యప్రాణులు తరచూ ఆహారం కోసం మానవ నివాస ప్రాంతాల వైపు వస్తుంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. తాజా ఘటనతో వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు