దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్(Central Cabinet) కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీ(New National Sports Policy)కి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. అటు రీసెర్చ్ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్‌కు కూడా క్యాబినెట్(Cabinet) ఆమోదముద్ర వేసింది. రూ. 1 లక్ష కోట్లతో కార్పస్ ఫండ్‌తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడమే ప్రధాన ఉద్దేశం. అలాగే దీర్ఘకాలిక తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు అందించనుంది కేంద్రం.
అలాగే తమిళనాడులో పరమాకుడి-రామనాథపురం మధ్య 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. రూ. 1,853 కోట్లతో 46.7 కిమీ మేర 4 వరుసలుగా రహదారి నిర్మించనుంది. అటు రామేశ్వరం కనెక్టివిటీని కూడా ఈ రహదారి మరింత పెంచనుంది.
రీసెర్చ్, ఇన్నోవేషన్‌కు భారీ కార్పస్ ఫండ్‌తో స్కీమ్
రూ. 1 లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌తో రీసెర్చ్ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్‌కి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడానికి వేదికగా నిలుస్తుంది. దీర్ఘకాలిక తక్కువ వడ్డీ రుణాలు లేదా వడ్డీ లేని రుణాలు అందించనుంది.
టెక్నాలజీ, స్టార్టప్, హై-ఎండ్ పరిశోధనలకు ఇది పెద్ద మద్దతుగా మారనుంది. పరమాకుడి – రామనాథపురం మధ్య 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మొత్తం రూ. 1,853 కోట్లు వ్యయంతో 46.7 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నారు.
రామేశ్వరం కనెక్టివిటీ మెరుగుపడడంతో పాటు ప్రादेशిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
Read Also: Fire Accident: శివకాశిలో భారీ పేలుడు 5 గురు సజీవ దహనం