BOM : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) తమ వినియోగదారులకు తీపి కబురు అందించింది. సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఊరటనిస్తూ గృహ రుణాలపై (Home Loans) వడ్డీ రేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లలో 10 బేసిస్ పాయింట్ల కోత విధించడంతో, ఇంతకుముందు 7.10 శాతంగా ఉన్న ప్రారంభ వడ్డీ రేటు ఇప్పుడు 7 శాతానికి దిగివచ్చింది. వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రాసెసింగ్ ఫీజుతో పాటు డాక్యుమెంటేషన్ ఛార్జీలను పూర్తిగా మినహాయిస్తున్నట్లు (వ్యాకేట్) బ్యాంక్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల కొత్తగా రుణాలు తీసుకోబోయే వారికి భారీగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
Read Also : ధర్మేంద్ర ప్రధాన్.. నెక్స్ట్ ఏంటి?
తక్కువ వడ్డీకే వాహన రుణాలు: బ్యాంకింగ్ రంగంలోనే అత్యల్ప రేట్లు!
కేవలం గృహ రుణాలు మాత్రమే కాకుండా, వాహన కొనుగోలుదారులను ఆకట్టుకునేలా కారు రుణాల (Car Loans) వడ్డీ రేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.45 శాతంగా నిర్ణయించింది. ప్రస్తుతం బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే తమ ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు అత్యంత తక్కువ స్థాయి అని బ్యాంక్ ప్రతినిధులు వెల్లడించారు. పండుగల సీజన్ మరియు మారకెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కొత్త రేట్లను అమలులోకి తెచ్చినట్లు తెలిపారు. తక్కువ వడ్డీ రేట్లు, శూన్య ప్రాసెసింగ్ ఫీజుల కలయికతో కొత్త రుణాలు పొందాలనుకునే వారికి ఇది చక్కని అవకాశమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :