చర్మం రంగు ఆధారంగా వివక్షను ఎదుర్కోవడం గురించి కేరళ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. దీనిపై సోషల్ మీడియాలో చేసిన పోస్టును మొదట తొలగించిన ఆమె, తర్వాత తిరిగి పోస్టు చేశారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఒక ఉన్నతాధికారి కూడా చర్మం రంగు ఆధారంగా వివక్షను ఎదుర్కోవాల్సిరావడం. ”నా ప్రధాన కార్యదర్శి పదవీ గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య విన్నాను. అది నా భర్త తెలుపంత నల్లగా ఉంది. నేను నా నలుపురంగును అంగీకరించాలి” అని శారదా మురళీధరన్ అన్నారు. 1990 బ్యాచ్ అధికారిణి అయిన శారదా మురళీధరన్, సెప్టెంబర్ 2024లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ముందు, ఆమె భర్త వి. వేణు ఈ పదవిలో ఉన్నారు.
శారదా మురళీధరన్ పోస్టులో ఏముందంటే…
మొదట చేసిన తన పోస్ట్‌ను తొలగించిన తర్వాత శారదా రీ పోస్టు చేశారు. దీనిపై వరదలా స్పందనలు రావడంతో తాను ఈ పోస్టును డిలీట్ చేశానని, కొందరు దీనిపై చర్చించాల్సిన అవసరముందని సూచించడంతో రీపోస్ట్ చేస్తున్నానని శారదా అన్నారు. నేను ఈ ప్రత్యేకంగా ఈ విషయం ఎందుకు చెప్పాలనుకున్నాను? నాకు బాధేసింది, అవును. కానీ గత ఏడు నెలలుగా, నాకు ముందు పదవిలో ఉన్న వ్యక్తితో (ఆమె భర్త) పోల్చుతున్నారు. నేను దానికి బాగా అలవాటు పడ్డాను. ”
నలుపు రంగులో అందం, విలువ లేవని, తెల్లని చర్మం ఆకర్షణీయంగా ఉంటుందని అన్న నమ్మకం మదిలో నిండిపోయింది. గొప్పవి, అద్భుతమైనవి, మంచివి, పరిపూర్ణమైనవి అన్నీ తెల్లటి రంగుతో ముడిపడి ఉంటాయని చాలామంది అంటూ ఉంటారు. నాకు తెల్లరంగు లేదు కాబట్టి నేను తక్కువదాన్నని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ వచ్చాను.’’ అంటూ ఆమె తన పోస్టులో రాశారు.