📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Col Sophia: కల్నల్ సోఫియా ఉగ్రవాదుల సోదరంటూ బీజేపీ నేత విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: May 14, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కల్నల్ సోషియా ఖురేషి (Sophia Qureshi) పేరు ఇటీవల బహుళ ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ (Operation sindoor) వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు ముందు వచ్చి వివరించడంతో సోషిపా ఖురేషి అందరి దృష్టిలో పడ్డారు. 1999లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్‌లో చేరి క్రమంగా 2016లో మల్టీనేషనల్ మిలటరీ (Multynational Military) విన్యాసాలకు సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా (Vijay Sha) చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కల్నల్ ఖురేషిని ‘టెర్రరిస్టుల సోదరి’గా పేర్కొంటూ ఆమెను కించపరచేలా విజయ్ షా మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.

Col Sophia: కల్నల్ సోఫియా ఉగ్రవాదుల సోదరంటూ బీజేపీ నేత విజయ్ షావివాదాస్పద వ్యాఖ్యలు

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు
మహులోని (ఇండోర్ జిల్లా) రాయ్‌కుంద గ్రామంలో జరిగిన హల్మా ఈవెంట్‌లో విజయ్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను బీహార్ కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది.
”వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణులు, ఆడకూతుళ్ల సిందూరం తుడిచేసి పారిపోయారు. వారి సొంత సోదరినే వాళ్లకు గట్టి సమాధానం చెప్పమని మనం పంపాం” అని విజయ్ షా మాట్లాడినట్టు ఆ వీడియోలో ఉంది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. కల్నల్ సోఫియా ఖురేషిని టెర్రరిస్టుల సోదరిగా ఆయన సంబోధించడం ఏమిటని నిలదీసింది. సోఫియా ఖురేషిని చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని, అయినా కొందరు ఆమె గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొంది. ఇది మన వీరజవాన్లను అమానించడమేనని ఆక్షేపించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితుడుగా చెప్పుకునే విజయ్ షాను తక్షణం రాజీనామా చేయాల్సిందిగా బీజేపీ కోరాలని డిమాండ్ చేసింది.

Read Also: Retired Jawan Murdered : రిటైర్డ్ జవాన్ దారుణ హత్య

#telugu News Ap News in Telugu BJP leader Vijay Shai's Breaking News in Telugu controversial remarks Google News in Telugu is the brother of terrorists Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today that Colonel Sophia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.