భారత ప్రజాస్వామ్యంలో ఓటింగ్ అనేది ఒక పవిత్రమైన హక్కు మాత్రమే కాకుండా, దేశ నిర్మాణానికి మూల స్తంభం. ఈ ప్రాతిపదికను ఆధునీకరించడంలో బీహార్ చరిత్రలో ఒక వినూత్న అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా, బీహార్ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి మొబైల్ యాప్‌ను ఉపయోగించే అవకాశాన్ని ఓటర్లకు కల్పిస్తూ చారిత్రాత్మకంగా నిలిచింది.శనివారం రోజు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో దేశంలోనే తొలి సారిగా ఓటర్లు మొబైల్ యాప్ (Mobile app) ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు భారత ఎన్నికల సంఘం శుక్రవారం రోజు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొబైల్ ఫోన్ల ద్వారా ఓటు వేయొచ్చని రాష్ట్ర ఎన్నకల కమిషనర్ దీపక్ ప్రసాద్ వెల్లడించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం, “ఇ-ఎస్‌ఈసీబీహెచ్‌ఆర్” (e-SECBHR) అనే ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడానికి
ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు వంటి బలహీన వర్గాల ఓటర్లకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడానికి ఇప్పటికే సుమారు 10,000 మంది ఓటర్లు ముందుకు వచ్చారని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.ఈ-ఓటింగ్ ప్రక్రియ (E-voting process) లో భద్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు ప్రక్రియ బహుళ-స్థాయి భద్రతా ప్రోటోకాల్స్‌తో పటిష్టంగా ఉంటుందని వెల్లడించారు. ఓటర్లు తమ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఇతర గుర్తింపు వివరాలను ఉపయోగించి యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ అత్యంత కఠినంగా ఉంటుందని, తద్వారా ఓటు దుర్వినియోగానికి అవకాశం లేకుండా చూస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా కూడా
మొబైల్ ఫోన్లు లేని వారికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అలాంటి వారు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా కూడా తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. అయితే బీహార్‌లో ఈ మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్ విజయవంతమైతే, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించడానికి మార్గం సుగమం అవుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో డిజిటల్ విప్లవానికి (digital revolution) నాంది పలకవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికలు కేవలం ఓట్లను నమోదు చేసుకోవడమే కాకుండా, సాంకేతికతను ఎన్నికల ప్రక్రియలో ఎలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చో చూపడానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తాయి.
Read Also: Guwahati: గౌహతి వెళ్తున్నారా? ఈ టాప్ టూరిస్ట్ ప్లేసులు మిస్ అవ్వకండి!