📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bharat : భారత్-పాక్ సైనిక శక్తి పోలికలో భారతదే పైచేయి

Author Icon By Digital
Updated: April 24, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాశ్మీర్‌లో పెహల్‌గాం ప్రాంతంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో 28 మంది మృతి చెందగా, భారత ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. అనంతరం పాకిస్తాన్ తన సైన్యాన్ని సరిహద్దుల్లోకి తరలించిందని అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది.ఈ నేపథ్యంలో ఇరుదేశాల సైనిక శక్తిని పరిశీలించిన నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత్ పాకిస్తాన్‌ను తలదన్నే స్థితిలో ఉంది. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ మరియు గ్లోబల్ ఫైర్ పవర్ వంటి సంస్థల నివేదికల ప్రకారం, భారత అణ్వాయుధాల సంఖ్య 150–170 మధ్య ఉండగా, పాక్ వద్ద 140–150 వరకు ఉన్నాయి.జనాభా పరంగా భారత్‌కు 140 కోట్లు కాగా, పాకిస్తాన్‌కు 22 కోట్లు మాత్రమే. భారత యువతలో సైన్యంలో చేరగల సామర్థ్యం ఉన్నవారి సంఖ్య 48 కోట్లు ఉండగా, పాకిస్తాన్ వద్ద అది 7.5 కోట్లు మాత్రమే. సైన్యంలో భారత్ వద్ద 14.4 లక్షల మంది సేవ చేస్తున్నారు. రిజర్వ్ దళాల్లో భారత్‌కు 28 లక్షలు ఉండగా, పాకిస్తాన్‌కు కేవలం 2 లక్షలే ఉన్నాయి.భూతల సైనిక బలగాల్లో భారత్‌కు 4500 ట్యాంకులు, 3147 సాయుధ వాహనాలు, 4158 శతఘ్నులు ఉన్నాయి. పాకిస్తాన్‌కు వీటి సంఖ్య తక్కువగా 2182, 2200, 1240 వరకే ఉంది. వైమానిక దళం పరంగా భారత్ వద్ద 2185 విమానాలు ఉండగా, పాక్ వద్ద 1281 మాత్రమే ఉన్నాయి. ఫైటర్ జెట్లు 590 (భారత్) Vs 320 (పాక్)గా ఉన్నాయి.

Bharat : భారత్-పాక్ సైనిక శక్తి పోలికలో భారతదే పైచేయి


భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక శక్తి: ఏవిధంగా భారతదే పైచేయి

నావికాదళంలోనూ భారత్ ఆధిపత్యమే ఉంది. భారత్‌కు రెండు విమాన వాహక నౌకలు, 16 జలాంతర్గాములు, 300పైగా నౌకలు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద మాత్రం ఈ వనరులు చాలా పరిమితంగా ఉన్నాయి — జలాంతర్గాములు ఐదు మాత్రమే, విమాన వాహక నౌకలు లేవు. పోర్టల్ క్రాఫ్ట్‌లు, డెస్ట్రాయర్లు, కొర్వెట్టీలు వంటి ఆధునిక యుద్ధ నౌకల్లో భారత్ బలంగా ఉంది.ఇది యుద్ధం అయితే భారతదే పైచేయి అని నిపుణులు స్పష్టంగా అంటున్నారు. అంతేకాక, ఆర్థికంగా కూడా భారత్ పాక్ కన్నా అనేక రెట్లు మెరుగైన స్థితిలో ఉంది. యుద్ధం జరిగితే పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.ఇంకా రష్యా–ఉక్రెయిన్ మాదిరిగా, పాక్ కూడా తన కొన్ని ప్రాంతాలను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రజలు స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధమవుతుండటంతో, దేశం మరింత చీలిపోయే ప్రమాదం ఉంది.ఈ నేపధ్యంలో భారత్ సైనిక మరియు ఆర్థిక శక్తిలో స్పష్టంగా పైచేయి కలిగి ఉందని స్పష్టంగా తేలుతోంది. కాబట్టి ఈ సందర్భంలో పాకిస్తాన్ యుద్ధం ఎంపిక చేస్తే, అది తమకు వినాశనానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More : Pahalgam Terror Attack : ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

Breaking News in Telugu Google News in Telugu India military superiority India Pakistan border tensions India Pakistan war scenario India vs Pakistan military strength Kashmir conflict updates Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.