📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Bengaluru Stampede:మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం సిద్దరామయ్య

Author Icon By Anusha
Updated: June 5, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జట్టు విజయోత్సవాల సందర్భంగా 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.మరో 47 మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా 40 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. వీరిలో 13 ఏళ్ల బాలిక అత్యంత పిన్న వయస్కురాలు. ముగ్గురు టీనేజర్లు, 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు ఈ ఘటనలో ప్రాణాలు విడిచారు. మృతులను దివ్యాంశి (13), దొరేశ (32), భూమిక్ (20), సహాన (25), అక్షత (27), మనోజ్ (33), శ్రావణ్ (20), దేవి (29), శివలింగ (17), చిన్మయి (19), ప్రజ్వల్ (20)గా గుర్తించారు. వీరంతా తమ అభిమాన జట్టు విజయాన్ని ఆస్వాదించడానికి స్నేహితులతో కలిసి వచ్చారు. వీరిలో చాలా మంది బెంగళూరు నగరానికి చెందినవారు కాగా, కొందరు ఇతర జిల్లాల నుంచి కూడా తరలివచ్చారు.

సన్మాన కార్యక్రమం

అత్యుత్సాహంతో ప్రారంభమైన సంబరాలు, క్షణాల్లో విషాదంగా మారడానికి భద్రతా ఏర్పాట్ల వైఫల్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. హడావుడిగా చేసిన ఏర్పాట్లు, సరైన ప్రణాళిక లేకపోవడం, అంచనాలకు మించి అభిమానులు తరలిరావడం ఈ దుర్ఘటనకు దారితీశాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విధానసౌధలో జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్(Thawar Chand Gehlot), సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విధానసౌధ వద్ద వీఐపీల భద్రతకు పెద్ద సంఖ్యలో పోలీసులను కేటాయించడంతో, లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించడానికి చిన్నస్వామి స్టేడియం వద్ద పరిమిత సంఖ్యలోనే పోలీసులు అందుబాటులో ఉన్నారు. స్టేడియం సామర్థ్యం సుమారు 35వేలు కాగా, మూడు లక్షలకు పైగా జనం గుమిగూడినట్లు సమాచారం.

Bengaluru Stampede

హెచ్చరికలు ఉన్నప్పటికీ

నిజానికి,భద్రతా కారణాల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీకి బెంగళూరు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. అయినప్పటికీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, జట్టు నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 3:14 గంటల సమయంలో హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఆర్‌సీబీ యాజమాన్యం(RCB ownership) విజయోత్సవ ర్యాలీని ధృవీకరిస్తూ, ఉచిత పాసులను ప్రకటించింది. దీంతో స్టేడియం వద్దకు అభిమానులు వెల్లువెత్తారు. 

ఉచిత వైద్యం

భద్రతా ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు పరిహారం, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. “ఇలాంటి ఘటనలు ఎన్నో చోట్ల జరిగాయి. వాటితో పోల్చి దీన్ని సమర్థించుకోను. కుంభమేళాలో 50-60 మంది చనిపోయారు. కానీ నేను విమర్శించలేదు. కాంగ్రెస్ విమర్శిస్తే అది వేరే విషయం. నేను గానీ, కర్ణాటక ప్రభుత్వం గానీ విమర్శించామా?” అని ఆయ‌న‌ ప్రశ్నించారు.

సామాన్యులకు ఏమైందో

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi) తీవ్రంగా స్పందించారు. “కుంభమేళాతో దీన్ని పోల్చడం సరికాదు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పుడు, మీరు వారిని ఎందుకు బలవంతం చేశారు? మరణాల తర్వాత కూడా మీరు సంబరాలు కొనసాగించారా? ఉపముఖ్యమంత్రి వారిని ఆహ్వానించడానికి ఎందుకు వెళ్లారు? వారు సెల్ఫీలతో బిజీగా ఉన్నారు, సామాన్యులకు ఏమైందో ఎవరూ పట్టించుకోవడం లేదు” అని జోషి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కుంభమేళా విషాద ఘటనను సున్నితంగా పరిష్కరించారని, అక్కడ ఎవరూ సెల్ఫీలు తీసుకోలేదని అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: PM Modi: ప్రధాని మోదీ ప్రారంభించిన అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్

#BengaluruStampede #KarnatakaCM #RCBStampedeTragedy #RCBVictoryEvent Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.