📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

Bengaluru Stampede: తొక్కిసలాట.. ఆర్బీబీపై నిషేధం విధిస్తారా?

Author Icon By Anusha
Updated: June 8, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB). దీని తర్వాత ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) బయట విక్టరీ పరేడ్, గ్రాండ్ సెలబ్రేషన్‌కు ప్లాన్ చేసింది. అయితే ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. ఇలా జరిగిన తర్వాత ఆర్సీబీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొందరిని అరెస్ట్ కూడా చేశారు.ఇప్పుడు ఈ ఘటనకు బాధ్యులను గుర్తిస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు. దాని పర్యవసానాలు ఎంతవరకు వెళ్తాయనేది ప్రశ్న. ఈ ఘటనకు కారణం ఆర్సీబీ(RCB) జట్టు అని ఐపీఎల్ 2026లో జట్టుపై నిషేధం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆర్సీబీ యాజమాన్యంతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం(KSCA)పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలో ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. బాధిత కుటుంబాల పిటిషన్లపై కోర్టు విచారణ కూడా ప్రారంభించింది.

కీలక నిర్ణయం

ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ ముందు చాలా పెద్ద ప్రశ్న ఉంది. ఈ ఘటనకు కారణం ఆర్సీబీ జట్టు అని తేలితే బీసీసీఐ(BCCI) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. దర్యాప్తుదారులు ఆర్సీబీ యాజమాన్యాన్ని ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తే లీగ్ విశ్వసనీయతను కాపాడేందుకు బీసీసీఐ ఆర్సీబీపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బీసీసీఐ వారిపై పరిమిత సమయం వరకు నిషేధం కూడా విధించే అవకాశం ఉంటుంది.

Bengaluru Stampede

ఆర్‌సీబీ మార్కెటింగ్

బెంగళూరు స్టాంపేడ్(Bengaluru Stampede)పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయ విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. విచారణ చేపట్టిన పోలీసులు ఆర్‌సీబీ ఫ్రాంచైజీతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌‌పై కేసులు నమోదు చేశారు. ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసెలె(Nikhil Sosele)తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్ సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్‌లను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కర్ణాట ప్రభుత్వం బెంగళూరు పోలీస్ కమిషన్ బి దయానంద్‌‌ను సస్పెండ్ చేసింది. సీఎం సిద్దరమయ్య పొలిటికల్ సెక్రటరీ కూడా విధుల నుంచి తొలగించారు. మరికొందరు ఉన్నతాధికారులపైన సస్పెన్షన్ వేటు పడింది.

Read Also: French Open: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పురుషుల సింగిల్స్ ఫైనల్

#BCCICanAct #InvestigateRCB #NonSilentBCCI #RCBUnderScrutiny Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.