📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

BCCI: రేపు బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ

Author Icon By Anusha
Updated: June 13, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఓ కీలక అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనుంది.ఐపీఎల్‌(IPL) ముగిసిన తర్వాత జరుగుతున్న ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది. ముఖ్యంగా లీగ్‌ను గెలిచిన జట్లు విజయోత్సవ ర్యాలీలు,కొత్త నియమ నిబంధనలపై  ఈ సమావేశంలో బోర్డు కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం.భారత క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.ఇండియన్ క్రికెట్‌ బాగు కోసం చేయాల్సిన మార్పుచేర్పుల విషయంలో బోర్డు ఎప్పుడూ వెనుకాడదు. ఇది గతంలో ఎన్నోసార్లు చూశాం. సరికొత్త నిబంధనలు తీసుకొస్తూ సమస్యలకు చెక్ పెడుతూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా మరోసారి నయా రూల్స్ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

BCCI

నిబంధనలను

జూన్ 4న నిర్వహించిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ(IPL franchise)లు నిర్వహించే వేడుకల విషయంలో కొత్త నియమ, నిబంధనలను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోందట బీసీసీఐ.ఈ మీటింగ్‌ను వర్చువల్‌గా నిర్వహించనున్నట్టు సమాచారం.ఇకపోతే,తొక్కిసలాట ఘటనలో అరస్టైన ఆర్‌సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ నిఖిల్‌ సొసలె(Nikhil Sosale)కు కర్నాటక హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరుచేసింది. జూన్‌ 6న కర్నాటక పోలీసులు నిఖిల్‌తో పాటు డీఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.

Read Also: Finn Allen : మేజ‌ర్ లీగ్‌ క్రికెట్ టోర్నీలో 19 సిక్సర్లతో ప్రపంచ రికార్డు!

#ApexCouncilMeeting #BCCI #IPL2025 #VictoryParadeGuidelines Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.