📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Balloon: నోట్లో పేలిన బెలూన్- 8ఏళ్ల చిన్నారి మృతి

Author Icon By Vanipushpa
Updated: March 28, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెలూన్ నోట్లో పేలిపోవడం వల్ల ఓ 8 ఏళ్ల బాలిక మరణించింది. బెలూన్​కు గాలిని ఊదుతుండగా అకస్మాత్తుగా పేలిపోయింది. బెలూన్​లోని ఓ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుపోవడం వల్ల ఊపిరాడక ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది. సరదాగా ఆడుకుంటున్న బాలిక మరణించడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పిల్లలతో కలిసి సరదాగా బెలూన్లను ఊదుతుండగా ఈ ప్రమాదం
ధూలే నగరంలోని యశ్వంత్ నగర్​లోని సక్రి రోడ్‌ సమీపంలో డింపుల్ మనోహర్ వాంఖడే అనే బాలిక ఈ ఘటనలో ప్రాణాలు విడిచింది. పిల్లలతో కలిసి సరదాగా బెలూన్లను ఊదుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి స్పృహతప్పి పడిపోయిన విషయాన్ని తోటి స్నేహితులు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. హుటాహుటినవారు ఓ ప్రైవేట్ వాహనంలో బాలికను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు, ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
మరో ఘటనలో పాలకుండలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
రాజస్థాన్​లో మరుగుతున్న పాలకుండలో ప్రమాదవశాత్తు పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. డీగ్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిందీ దుర్ఘటన.

మంగళవారం సాయంత్రం సారిక(3) ఇంటి పైకప్పుపై ఉన్న పిల్లిని చూసి భయపడింది. ఈ క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించింది. పరిగెడుతూ వెళ్తుండగా, స్టవ్ దగ్గర ఉంచిన వేడి పాలు ఉన్న పాత్రలో పడిపోయింది. దీంతో చిన్నారికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాల్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం భరత్​పుర్​కు, ఆపై జయపురకు తరలించారు. అక్కడ కాలిన గాయాలకు చికిత్స పొందుతూ చిన్నారి బుధవారం రాత్రి ప్రాణాలు విడిచింది.

#telugu News 8-year-old dies Ap News in Telugu Balloon bursts in mouth Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News"8-year-old dies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.