Ayodhya : ఇందుగలడందులేదని సందేహము వలదు చక్రి సర్వో పగతుండు’ ఎందెందు వెదకిచూచిన అందందే…! అనే పోతన భాగవతంలోని పద్యతాత్పర్యం ఆలకిస్తే విష్ణువు అలవైకుంఠపురంలోనే కాదు ఎక్కడ చూసినా అన్ని చోట్లా ఉంటాడని అర్థం. దేవుడున్నచోట మకిల ఉండదని చెప్పుకునేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ దైవ క్షేత్రాల్లోనూ అవినీతి మూడుపువ్వులు ఆరుకాయలుగా విలసిల్లుతూ ఉంటుందనే విషయం ‘అయోధ్య, బద్రీనాథ్ వంటి దైవక్షేత్రాల్లో సైతం బయటపడుతోంది. అయోధ్య ఆదొక దివ్యధామం. బాబ్రీ మసీదు, రామజన్మభూమి అంశంపై హిందూ ముస్లింల మధ్య పొరపొచ్చాలను ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ‘క్షీర నీర’ న్యాయం అన్న చందాన తేల్చేశాక అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంతో శ్రద్ధాసక్తులతో రామభక్తులు పూనుకున్నారు. ఆ వెంటనే గత కాలంలో వారణాసి, మధిర, వంటి ఎన్నో దివ్య క్షేత్రాల్లో భారతీయ భక్తితత్వంపై, దివ్యక్షేత్రాలపై ముస్లింలు దాడి చేసి ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ కోర్టులకెక్కారు. జరిగింది ఎప్పుడైనా న్యాయం ఇప్పటికైనా లభిస్తోంది. కొన్నిటిపై హిందూ ధర్మ పరిరక్షణ పేరిట తీర్పులు సానుకూలంగా పొందారు కూడా. ఆ మేరకు ఆయా ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దైవక్షేత్ర పునర్నిర్మాణ కార్య క్రమాలు చేపట్టారు. భరతుడు రామపాదుకలు పట్టిన ట్లుగా దేశంలోని మారుమూల ప్రాంతాలు సైతం రామ మందిర నిర్మాణానికి పేర్చనున్న ఇటుకలను పరమభక్తి భావంతో పూజలు చేసి మరీ ఫైజాబాద్కు తీసుకెళ్లారు రామభక్తులు.
Read Also : Google : కోర్టు రికార్డింగ్‌ల పర్యవేక్షణ మా పని కాదు: సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన గూగుల్

Ayodhya : కలియుగధర్మం కుంటినడక
భక్తిపారవశ్యంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన చరిత్రలో అతి ప్రాధాన్యమైన విషయంగా నిలిచి పోయింది. ‘రామో విగ్రహవాన్ ధర్మ: అనేమాట భక్తుల నోట ఎప్పుడూ నానేమాట. రాముడంటేనే ధర్మం మూర్తీ భవించిన వ్యక్తి అతని రాజ్యంలో ధర్మం నాలుగు పాదా లతో నడుస్తుందని ప్రతీతి. కాగా ప్రస్తుత కలియుగధర్మం కుంటినడక నడుస్తోందని చెప్పక తప్పదు. దైవధామాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్న విషయం ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సాధారణ హిందూ దేవాలయాల్లో భక్తుల దోపిడీ జరుగుతుందన్నది జనశ్రుతిగా సాగు తోంది. రాముడి పేరిట, దేముడి దోసిట ప్రసాదాలు, ధానధర్మాలుగా వచ్చినవి ఎటువంటివైనా కైంకర్యమే. వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి భక్తిభావం కానీ, ధర్మా చరణ కానీ అందుబాటులో లేవు. హుండీల్లో నగలు, నగదు కూడా మాయ మే. తన కళ్లెదుట అపవిత్ర కార్యాలు, ఆసంగతులు జరుగుతున్నా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. అయోధ్య విరాళాల కుంభ కోణంలో ఎన్నో అవినీతి కార్యక్రమాలు బయటపడ్డాయి. ఈ రామమందిర నిర్మాణ చరిత్రను తవ్విచూస్తే బాబ్రీ మసీద్ అయోధ్య రామమందిరం కథల కన్నా ఎన్నో విషయాలు బయటి కొస్తున్నాయి.
తిలాపాపం తలా పిడికెడు
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారన్న రీతిలో కలియుగ ప్రస్థానం లో ఎవరితోనూ మాట్లాడని రాముడి సేవా కైంకర్యాలు, వైభవ సంకేతాలను సైతం సొంతం చేసుకునే చంపత్ రామ్లు, పూజారిలు, కొంత మంది ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తిక నేతలు సైతం ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్న చందాన చేతులేశారు. రాముడు ఎంతో పతితపావనుడు, రామజన్మ భూమి ఎంతో పవిత్రమైనది’ అని పదేపదే మనం గొంతు చించుకోవడం తప్పితే ఆయా దేవుళ్లకు, ఆయా ప్రాంతాలకు పవిత్రతను సమకూర్చే ఎలాంటి కార్యాచరణ అక్కడ కనపడదు. కుంభకోణాలు, కైంకర్యాలు, అవినీతి కార్యకలాపాలు, ఇవన్నీ దైవలీలలా అంటే కాదనే చెప్పాలి. ‘తీగ లాగితే డొంకంతా కదిలినట్లు’ ప్రతీ అంశంలోనూ ఎన్నో చిత్రవిచిత్రాలు తారసపడుతున్నా యి. అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాజాగా స్పందించింది. ఆరెస్సెన్ తొలిసారి ఈ అంశంపై దుర దృష్టకరమని వ్యాఖ్యానించింది. అసాధారణ అవినీతిని నొచ్చుకుంది కూడా. ఈ ఉదంతం యావత్తూ రామ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ఆందోళన చెందారు. హిందూ ధర్మాన్ని సమాజాన్ని అప్రతిష్టపాలు చేసే శక్తుల్ని వారి కుట్రల్ని తిప్పికొట్టాలని పిలుపు నివ్వడంలో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు.

ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక
ఇలాంటి కుంభకోణాల వ్యవహా రాల్లో ఏలినవారు కానీ గట్టు మీదనున్నవారు కానీ స్పందించే తీరు సహజంగా ఇలాగే ఉంటుంది. అంతాజరిగాక ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవా బుదారీతనాన్ని బలోపేతం చేయాలని శ్రీ రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సూచించడమంటే ఎంతో పరి హాసాస్పదంగానే గోచరిస్తోంది. ఎక్కడైతే నిజాయితీ పాదముద్రలు స్పష్టంగా కనపడతాయని భావి స్తామో అక్కడవి మచ్చుకైనా కానరాకపోతే కలిగే ఫీలింగ్ మాత్రమే జనిస్తోంది. ప్రజాబాహుళ్యంలో బిజెపి పాలిత ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్లో కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగినట్లుసోషల్ మీడియాలో వెల్లువెత్తు తున్న విమర్శలు ఈ దేశ దైవధామాల అవినీతి కథలను మరింత గందరగో ళపరుస్తున్నాయి. విరాళాల నోట్ల లెక్కింపు కోసం నియమించుకున్న వారి నేపథ్యం సరిగా పరిశీలించుకోనందు వల్లనే ఈ పొరపాట్లు జరిగాయని సరిపెట్టుకున్నా, జరిగిన ‘తమాషా’ను ఏ విధంగానూ సమర్ధించుకోలేని పరిస్థితి రామభక్తుల్లో నెలకొని ఉంది. అయోధ్య భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. కోట్లాది మంది భక్తులు భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో పూర్తిస్థాయి చట్టబద్ధ దర్యాప్తు అవసరం ఉంది. విశ్వాసం ఉన్నచోట పారదర్శకతకూ ఎక్కువ విలువ ఇవ్వాల్సి ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: