📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

ATM Train: ట్రైన్ జర్నీలోనూ ఏటీఎం మీ వెంటే..!

Author Icon By Vanipushpa
Updated: April 16, 2025 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశం నలుమూలల నుండి ఎంతో మంది ప్రతిరోజు ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. దూర ప్రయాణలకు రైల్వే మార్గం చాల సమయాన్ని అడా చేస్తుంది ఇంకా ఖర్చు కూడా తక్కువ. అయితే ఇండియన్ రైల్వే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తుంది. ఇప్పుడు మరో కొత్త సర్వీస్ తీసుకొచ్చింది. ఏంటంటే ఇండియాలో తొలిసారిగా కదులుతున్న రైలులో ఏటీఎం సర్వీస్ ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం ట్రయల్ రన్ కింద తీసుకొచ్చిన ఈ సర్వీస్ విజయవంతమైంది. నాసిక్‌లోని మన్మాడ్ నుండి ముంబై మధ్య నడుస్తున్న పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో ఈ ఏటీఎం ఏర్పాటు చేసారు. టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ప్రకారం, ఈ ట్రయల్ రన్ టెస్ట్ సక్సెస్ అయ్యింది. ఈ రైలును ‘ఫాస్ట్ క్యాష్ ఎక్స్‌ప్రెస్’ అని పిలుస్తారు.

రైలులో కూడా డబ్బు విత్ డ్రా
కొన్ని సందర్భాలలో తప్ప ఈ ఏటీఎం సరిగ్గానే పనిచేసిందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే కొన్ని ప్రదేశాలలో సిగ్నల్ మాయమైంది. నెట్‌వర్క్ సమస్య ఉన్న ప్రాంతాలలో అలాగే సొరంగాలు ఉన్న ప్రదేశాలలో నెట్‌వర్క్ సమస్య తలెత్తుతున్నట్లు అధికారులు గ్రహించారు. ఈ ట్రయల్ రన్ ఫలితాలు బాగున్నాయని భూసావల్ DRM (డివిజనల్ రైల్వే మేనేజర్) ఇతి పాండే అన్నారు. ఇప్పుడు ప్రజలు కదులుతున్న రైలులో కూడా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈ ఎటిఎం మెషిన్ పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు కూడా తెలిపారు. ఈ ATM భూసావల్ రైల్వే డివిజన్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మధ్య సహకారంతో ఏర్పాటు చేయబడింది. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని 22 బోగీలు వెస్టిబ్యూల్‌లతో అనుసంధానించి ఉన్నాయి. అందువల్ల ఏటీఎంను ఈజీగా చేరుకోవచ్చు. వెస్టిబ్యూల్ అంటే రైలు కంపార్ట్‌మెంట్లను కలిపే మార్గం.
CCTV కెమెరాల ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తారు
ఇక భద్రత విషయానికొస్తే ఈ ATM కియోస్క్‌లను క్లోజ్ చేసే ఫెసిలిటీ కూడా ఉందని అధికారులు తెలిపారు. అలాగే దీనిని CCTV కెమెరాల ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తారు. ఈ ATMలో డబ్బు తీసుకోవడానికి మాత్రమే కాకుండా చెక్ బుక్‌ ఆర్డర్ చేయడంలో ఇంకా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను పొందడంలో కూడా సహాయపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మొబైల్ బ్యాంక్ బ్రాంచ్ లాంటిది.
ప్రయాణీకులకు గొప్ప సౌకర్యం
ఇతర రైళ్లలో కూడా ఈ సర్వీసు :
పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలు ముంబై – హింగోలి జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్ తో అనుసంధానించి ఉంటుంది. అందువల్ల, ఈ ATM మన్మాడ్-నాసిక్ మార్గం దాటి హింగోలికి ప్రయాణించే సుదూర ప్రయాణికులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రైళ్లు మూడు ట్రాక్లను షేర్ చేసుకుంటాయి. ఈ ATM సర్వీస్ ప్రజాదరణ పొందితే దీనిని ఇతర ప్రముఖ రైళ్లకు కూడా ప్రవేశ పెట్టవచ్చని అధికారులు తెలిపారు. అంటే ప్రజలు ఈ ATM సర్వీస్ ఇష్టపడితే మరిన్ని రైళ్లలో దీనిని ఏర్పాటు చేస్తారు. దీని వల్ల ప్రయాణీకులకు గొప్ప సౌకర్యాన్ని అందిస్తుంది. ఇప్పుడు ప్రయాణికులు డబ్బు తీసుకోవడానికి స్టేషన్‌లో దిగాల్సిన అవసరం లేదు. ఇంకా రైలులోనే సౌకర్యవంతంగా డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

Read Also: Aurangzebs Tomb : ఔరంగజేబు సమాధిని రక్షించాలంటూ ఐక్య‌రాజ్య‌స‌మితికి లేఖ

#telugu News Ap News in Telugu ATM is with you even Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu on your train journey..! Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.