📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Assam: భారీ వర్షాల వల్ల అసోం, అరుణాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు

Author Icon By Anusha
Updated: June 1, 2025 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ఈశాన్య భారతదేశం అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతాల్లో వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడి 24 గంటల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్, అసోంలోనే 14 మంది మృతి చెందారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు ఈ విపత్తుతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అసోంలోని 12 జిల్లాల్లో 60,000 మందికి పైగా ప్రజలు వరదలకు ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌(Arunachal Pradesh)లోని ఈస్ట్ కామెంగ్ జిల్లాలో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బనా-సెప్పా మార్గంలోని NH-13 రూట్ లో ప్రయాణించే వాహనం లోయలో పడిపోవడంతో మృతి చెందారు. అదే ప్రాంతంలో ఉన్న మరో సుమో వాహనం కూడా ప్రమాదానికి గురయ్యింది, అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.

అధికారులు

వాతావరణ శాఖ అసోంలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మిగిలిన ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలతో పాటు ఉత్తర బంగ్లాదేశ్- షిల్లాంగ్ సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు తీవ్రరూపం దాల్చినట్లు వాతావరణ శాఖ(Department of Meteorology) వెల్లడించింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. వర్షాల దాటికి ఇళ్లు కూలి కొండచరియలు విరిగిపడ్డాయి. అసోంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. గువాహాటికి సమీపంలోని బోండా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మహిళలు మృతి చెందారని నగర వ్యవహారాల మంత్రి జయంత మల్ల బరూయ(Jayantha Malla Baruya) తెలిపారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గువాహాటిలో ఒకరోజు వర్షపాతం 67 ఏళ్ల రికార్డు బద్దలైంది. మొత్తం 111 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. బ్రహ్మపుత్ర(Brahmaputra) సహా అనేక నదుల్లో నీటి మట్టం పెరిగింది. జీరోలోని కాబేజ్ గార్డెన్ ప్రాంతం పైన్ గ్రోవ్ సమీపంలోని ఒక రెస్టారెంట్ వద్ద రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అసోంకి చెందిన ఇద్దరు మృతి చెందింది. వీరు ఇద్దరూ అక్కడి రెస్టారెంట్‌లో పనిచేస్తున్నవారిగా గుర్తించారు. మిజోరాంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి.. నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.

Assam

వర్షాకాలం

కాగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేశాయి. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి మాత్రం మే 23కే ప్రవేశించింది. అనంతరం రెండు రోజుల్లోనే దక్షిణాది రాష్ట్రాలకు(southern states) విస్తరించాయి. ఇక, అక్కడ నుంచి ఉత్తర భారతానికి కూడా చేరుకున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో ముందస్తుగానే వర్షాకాలం మొదలైంది. మే 27 నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Read Also: Asaduddin Owaisi: మరోసారి పాకిస్థాన్ విధానాలపై ఒవైసీ తీవ్ర విమర్శలు

#FlashFloods #IndiaWeather #LandslideAlert #NortheastIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.