📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్

Author Icon By Vanipushpa
Updated: February 4, 2025 • 12:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వక్ఫ్ సవరణ బిల్లు 2024ను పార్లమెంట్ ముందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లీస్ ఇ-ఇత్తేహదుల్ ఇస్లామీన్ అధినేత అసుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. బిల్లు ఆమోదం పొందితే దేశంలో సామాజిక అస్థిరతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును మొత్తం ముస్లిం సమాజం తిరస్కరించిందని ఒవైసీ చెప్పారు. సోమవారం ఆయన పార్లమెంట్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ‘‘నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.. ప్రతిపాదన వక్ఫ్ చట్టాన్ని తీసుకొస్తే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26, 14లను ఉల్లంఘిస్తుంది.. ఈ దేశంలో సామాజిక అస్థిరతకు దారితీస్తుంది. దీనిని మొత్తం ముస్లిం సమాజం తిరస్కరించింది.. వక్ఫ్ ఆస్తులు ఏమీ ఏదీ మిగలవు’’ అని అన్నారు.

‘మీరు దేశాన్ని వికసిత్ భారత్’గా మార్చాలనుకుంటున్నారు.. మేము ‘వికసిత్ భారత్’ను కోరుకుంటున్నాం… మీరు ఈ దేశాన్ని 80లు.. 90ల ఆరంభంలోకి తీసుకెళ్లాలనుకుంటే అది మీ బాధ్యత’ అని మోదీ ప్రభుత్వానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ‘గర్వించదగ్గ భారతీయ ముస్లింగా నేను మసీదులో అంగుళం స్థలం కూడా వదులుకోను.. నా దర్గాలో ఇంచు భూమిని కోల్పోను… దీనికి నేను అనుమతించను… మేము ఇకపై ఇక్కడికి వచ్చి మెతక ప్రసంగాలు చేయం… మేము భారతీయులగా గర్విస్తున్నాం… నా సమాజం కోసం నిలబడి నిజాయితీగా మాట్లాడాల్సిన సభ ఇది.. ఇది నా ఆస్తి, ఎవరూ ఇవ్వలేదు. అని ఒవైసీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో ‘వక్ఫ్‌ బై యూజర్‌ (దీర్ఘకాలం వక్ఫ్‌ బోర్డు వినియోగంలో ఉండే ఆస్తి దానికే శాశ్వతంగా సంక్రమిస్తుంది. కోర్టుల్లో సవాల్‌ చేయడానికి వీల్లేదు)’ అనే నిబంధనను తొలగించడాన్ని ఒవైసీ వ్యతిరేకించారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu owaisi asaduddin Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.