మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలు దేశం మొత్తాన్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా అక్కడి పోలీసులు.. బిచ్చం అడుగుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. భోపాల్‌లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అతను వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ.. బిచ్చం అడుగుతున్నాడు. ఇది గమనించిన ఓ పౌరుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆ బిచ్చం ఎత్తుకునే వ్యక్తిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఇంతలా కఠినంగా వ్యవహరించడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే భిక్షాటన నిరోధక చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. ఎవరైనా బిచ్చం అడగడం, బిచ్చం వెయ్యడం రెండూ నేరమే. ఈమధ్య అదే మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఓ గుడి ముందు అడుక్కుంటున్న యాచకురాలికి ఓ వ్యక్తి బిచ్చం వెయ్యడంతో.. అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 223 ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయం కూడా దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
బిచ్చం అడిగినందుకు అరెస్ట్..ఆ వివరాలు ఏంటి?
By
Vanipushpa
Updated: January 27, 2025 • 1:20 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.