మాతృభాష మాట్లాడటంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కీలక కామెంట్స్ చేశారు. భారతీయ భాషల గొప్పతనాన్ని కాపాడాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలో సిగ్గుపడే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. భారతీయ సంస్కృతిని కాపాడడంలో సాహిత్య పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నిర్దేశించిన ‘పంచ ప్రాణ్’ (ఐదు ప్రతిజ్ఞల) గురించి కూడా ఆయన మాట్లాడారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందడానికి ఇది చాలా ముఖ్యమని తెలిపారు. పరిపాలనా అధికారుల శిక్షణలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు.దిల్లీలో IAS మాజీ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రాసిన “మేన్ బూంద్ స్వయం ఖుద్ సాగర్ హూన్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
భారతీయ సమాజంలో
ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్‌షా భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచాన్ని నడిపించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.ఇంగ్లీష్ (English) మాట్లాడేవారు త్వరలో సిగ్గుపడతారు. అలాంటి సమాజం ఏర్పడే రోజు ఎంతో దూరం లేదు. భారతీయ సమాజంలో మార్పు తీసుకురావాలని గట్టిగా అనుకున్నవారే ఇది సాధ్యం అయ్యేలా చేయగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి ఆభరణాలని నేను నమ్ముతున్నాను. మన భాషలు లేకుండా మనం నిజమైన భారతీయులం కాలేము” అని అమిత్ షా అన్నారు.
భారతీయ సంస్కృతి, చరిత్ర, మతాన్ని విదేశీ భాషలు పూర్తిగా అర్థం చేసుకోలేవని షా అన్నారు. వాటిని అర్థం చేసుకోవడానికి విదేశీ భాషలు (Foreign languages) సరిపోవని చెప్పారు.విదేశీ భాషలతో పూర్తి భారతదేశాన్ని అర్థం చేసుకోలేమని ఆయన అన్నారు. అయితే భారతీయ భాష (Indian language) లను కాపాడేందుకు చేస్తున్న ఈ పోరాటం ఎంత కష్టమో తనకు తెలుసునని కానీ భారత్ విజయం సాధిస్తుందని తనకు నమ్మకం ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా భారతదేశాన్ని సొంత భాషల్లోనే నడుపుతామని ప్రపంచానికి కూడా భారతీయులే నాయకత్వం వహిస్తారని అమిత్ షా అన్నారు.
Read Also: Omar Abdullah: వందేభారత్ రైలులో జమ్మూకశ్మీర్ సీఎం ప్రయాణం