📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

CSK : సిఎస్ కె పై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు

Author Icon By Anusha
Updated: April 22, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) పోరాటం ముగిసిందని ఆ జట్టు మాజీ బ్యాటర్, కామెంటేటర్ అంబటి రాయుడు అన్నాడు. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరలేదనే విషయం మహేంద్ర సింగ్ ధోనీకి కూడా తెలుసన్నాడు. ధోనీనే ఈ విషయాన్ని అంగీకరించాడని కూడా రాయుడు గుర్తు చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సీఎస్‌కే 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఇది ఆ జట్టుకు 6వ ఓటమి.ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన.. రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 విజయం సాధిస్తేనే సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఒక్క మ్యాచ్ ఓడితే ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.

ఆయుష్ మాత్రే

ధోనీ సైతం సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనని పరోక్షంగా వెల్లడించాడు. వచ్చే సీజన్‌ కోసం ఫైనల్ ఎలెవన్ ప్రిపేర్ చేసుకుంటామని తెలిపాడు. సీఎస్‌కే ఆట తీరుపై జియో హాట్‌స్టార్‌లో మాట్లాడిన రాయుడు ఆ జట్టు కమ్ బ్యాక్ చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు.ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకోవడం కష్టమే. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వచ్చే సీజన్ కోసం ఫైనల్ ఎలెవన్ ప్రిపేర్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టామని చెప్పాడు. వచ్చే ఏడాది కోసం కుర్రాళ్లను సిద్దం చేయాలని సీఎస్‌కే భావిస్తోంది.వారు మరింత సానుకూల ఉద్దేశ్యంతో ఆడాలి. బహుషా ఆయుష్ మాత్రే వంటి కుర్రాళ్లకు ఇక నుంచి వరుస అవకాశాలు దక్కనున్నాయి.

ఇంటెంట్

ముంబైతో ఓటమికి మిడిల్ ఓవర్లలోని జిడ్డు బ్యాటింగే కారణం. 7 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే చేశారు. టీ20 క్రికెట్‌లో ఎవరూ ఇలా ఆడరు. ఆట చాలా డెవలప్ అయ్యింది. మిడిల్ ఓవర్లలో మెరుగైన స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలి. సీఎస్‌కేకు సరైన ఇంటెంట్ లేదు. ఒక మ్యాచ్‌లో ఓడిపోవచ్చు. అయినా పోరాడాలి. ఒక దశను ధాటడానికి మాత్రమే ప్రయత్నించవద్దు. మంచి ముగింపు ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఆ వికెట్‌పై 190 పరుగులు పోరాడే లక్ష్యం. సీఎస్‌కే నమోదు చేసిన లక్ష్యం ఏ మాత్రం సరిపోదు. మిడిల్ ఓవర్లలోని బ్యాటింగ్ వైఫల్యం సీఎస్‌కే ఓటమిని శాసించింది.’అని రాయుడు చెప్పుకొచ్చాడు.

Read Also: Shresta Iyer: శ్రేయాస్ అయ్య‌ర్‌పై ట్రోల్స్‌ స్పందించిన శ్రేష్టా అయ్య‌ర్

#AmbatiRayudu #ChennaiSuperKings #CSK #CSKvsMI #IPL2025 #MSDhoni Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.