हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

High Court: లాయర్ రోబ్ ధరించలేదని,న్యాయవాదికి శిక్ష విధించిన అలహాబాద్ హైకోర్టు

Anusha
High Court: లాయర్ రోబ్ ధరించలేదని,న్యాయవాదికి శిక్ష విధించిన అలహాబాద్ హైకోర్టు

అలహాబాద్ హైకోర్టులో షర్టు బటన్ పెట్టుకోకుండా, మెడచుట్టూ ధరించే లాయర్ రోబ్ లేకుండానే ఓ కేసు వాదించేందుకు వెళ్లిన న్యాయవాదికి అలహాబాద్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడంటూ ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 2 వేల రూపాయల జరిమానా కూడా వేసింది. ఒకవేళ జరిమానా కట్టలేకపోతే మరో నెల రోజులు ఎక్కువగా జైల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

అశోక్ పాండే

ఆగస్టు 18, 2021లో అలహాబాద్ హైకోర్టు స్థానిక న్యాయవాది అశోక్ పాండే షర్టు బటన్ లేకుండా లాయర్లు మెడ చుట్టూ ధరించే రోబ్ లేకుండానే కేసు వాదించేందుకు వెళ్లాడు. విషయం గుర్తించిన న్యాయమూర్తులు అతడిని బయటకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన లాయర్ అశోక్ పాండే న్యాయమూర్తులను గుండాలని సంబోధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు మొదలు అయ్యాయి. అనేక అవకాశాలు ఉన్నా ఆశోక్ పాండే మాత్రం ఈ ఆరోపణలపై స్పందించలేదు.

 High Court: లాయర్ రోబ్ ధరించలేదని,న్యాయవాదికి శిక్ష విధించిన అలహాబాద్ హైకోర్టు

నేడు విచారణ

అలహాబాద్ హైకోర్టు ఈ కేసుపై నేడు విచారణ జరిపింది. ముఖ్యంగా న్యాయవాది అశోక్ పాండే నిజంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడని కోర్టు తేల్చింది. అతడు షర్టు బటన్ పెట్టుకోకుండా, రోబ్ ధరించకూడనే కేసు వాదించేందుకు వచ్చాడని న్యాయవాదులును కూడా గూండాలని సంబోధించినట్లు తెలిపింది. 2017లోనూ ఆయనపై కోర్టు ప్రాంగణం నుంచి రెండేళ్ల నిషేధం విధించబడిందని వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఆయనకు శిక్ష వేస్తున్నట్లు చెప్పింది.ఆరు నెలల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ వివేక్ చౌదరీ, బీఆర్ సింగ్‌లకు చెందిన డివిజన్ బెంచ్ తీర్పును ఇచ్చింది. అంతేకాకుండా రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఒకవేళ ఆ డబ్బులు చెల్లించలేకపోతే మరో నెల రోజులు ఎక్కువగా జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అలాగే లక్నోలోని చాఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట లొంగిపోవడానికి ఆశోక్ పాండేకు 4 వారాల సమయం కూడా ఇచ్చింది. అంటే మే 1వ తేదీన ఆయన అక్కడకు వెళ్లాలి. ఇది మాత్రమే కాకుండా అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్‌లలో లీగల్ ప్రాక్టీస్ చేయకుండా ఎందుకు నిషేధం విధించకూడదో అడుగుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.

Read Also: Tahawwur Rana:తహవ్వూర్ రాణా అప్పగింతపై కాంగ్రెస్ కౌంటర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870