📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Muslim Law: ఘాటుగా స్పందించిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు

Author Icon By Vanipushpa
Updated: April 2, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభకు వచ్చింది. కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు- దీన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చను మొదలుపెట్టారు. కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ఈ 31 మందిలో తెలంగాణ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, డీకే అరుణ, ఏపీ నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, విజయసాయి రెడ్డి సభ్యులుగా కొనసాగారు. ఆ తరువాత సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ కమిటీ ఇప్పటివరకు 284 మందితో చర్చలు జరిపింది. ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో సమావేశమైంది. ప్రజాభిప్రాయాలను సేకరించింది. ముస్లిం మత పెద్దలతో భేటీ అయింది. అలాగే- మూడుసార్లు స్టడీ టూర్లనూ నిర్వహించింది.

ఆందోళన వ్యక్తం
ఈ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఘాటుగా స్పందించింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదని డిమాండ్ చేసింది. దీన్ని తాము వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేసింది. వక్ఫ్ ప్రయోజనాలు, ఉద్దేశాలకు విఘాతంలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మహమ్మద్ ఫజల్-వుర్- రహీం ముజాద్దిదీ, అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇల్యాస్ మాట్లాడారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించిన సవరణలు వక్ఫ్ బిల్లును మరింత క్లిష్టంగా మార్చాయని అన్నారు. జేపీసీ మోసపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు గానీ, వివిధ రాష్ట్రాల మైనారిటీ కమిషన్లు, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల అభ్యంతరాలను జేపీసీ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే.. తాము చూస్తూ కూర్చోబోమని తేల్చి చెప్పారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఖాసిం రసూల్ ఇల్యాస్ అన్నారు.

#telugu News All India Muslim Personal Law Board Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News strongly reacted Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.