Baramati News: ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు

Read Time:  1 min
Baramati News
Baramati News
FONT SIZE
GET APP
Baramati News: Ajit Pawar's funeral concluded
Baramati News: Ajit Pawar’s funeral concluded

Baramati News: మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత అజిత్ పవార్(Ajit Pawar Funeral) ప్రస్థానం ముగిసింది. విమాన ప్రమాదంలో అకాల మరణం చెందిన ఆయన పార్థివ దేహానికి బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో గురువారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తమ ప్రియతమ నాయకుడిని కడసారి చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు మరియు లక్షలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.

Read Also: Ajit Pawar: ఎట్టకేలకు దొరికేసిన ‘బ్లాక్ బాక్స్’.. కొనసాగుతున్న దర్యాప్తు  

పోలీసుల గౌరవ వందనం, ప్రభుత్వ లాంఛనాల మధ్య జరిగిన ఈ అంతిమ సంస్కారాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బారామతి వీధులన్నీ ‘అజిత్ పవార్ అమర్ రహే’ అనే నినాదాలతో మారుమోగాయి. రాజకీయ యోధుడికి వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు కన్నీరుమున్నీరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.