అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.అహ్మదాబాద్ నుంచి లండన్ (London) బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే బిల్డింగ్‌పై కూలిపోయింది.ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను అధికారులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటంతో, గుర్తించడంలో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కుటుంబ సభ్యులకు
ఇప్పటివరకు కేవలం ఐదుగురు మృతుల దేహాలను మాత్రమే గుర్తించగలిగారు. గుర్తించిన వారిలో గుజరాత్‌కు చెందిన ఇద్దరు, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. దీంతో అధికారులు డీఎన్‌ఏ శాంపిల్స్ (DNA samples) ద్వారా మృతదేహాలను గుర్తిస్తున్నారు. మరోవైపు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు దాదాపు 70 నుంచి 80 మంది వైద్యుల బృందం పనిచేస్తోంది.
Read Also: Plane Crash : అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో మృతదేహాలకు శవపరీక్షలు